Telugu Global
International

ఐరోపాలో బ‌రువ‌వుతున్న బాల్యం!

ఐరోపాలో త్వ‌ర‌లోనే ఒక పెద్ద బాంబు పేల‌నుంది. బాంబు అంటే మాన‌వ‌బాంబో, టైంబాంబో కాదు.. అది ఊబ‌కాయ బాంబ్‌. విష‌య‌మేంటంటే..! ప్ర‌పంచంలోని చిన్నారి ఊబ‌కాయుల‌లో అధిక‌భాగం ఐరోపాలోనే ఉన్నార‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) తాజాగా వెల్ల‌డించింది. 0-3 ఏళ్ల‌లోపు బాల‌ల్లో ఎంత‌మంది ఊబ‌కాయ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారో స‌ర్వే చేసి జాబితా విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం.. 27 శాతంతో ఐర్లాండ్ మొద‌టి స్థానంలో, ర‌వి అస్త‌మించ‌ని సామ్రాజ్యంగా పేరొందిన‌ బ్రిట‌న్ 23 శాతంతో రెండోస్థానంలో నిలిచింది. త‌రువాత […]

ఐరోపాలో బ‌రువ‌వుతున్న బాల్యం!
X
ఐరోపాలో త్వ‌ర‌లోనే ఒక పెద్ద బాంబు పేల‌నుంది. బాంబు అంటే మాన‌వ‌బాంబో, టైంబాంబో కాదు.. అది ఊబ‌కాయ బాంబ్‌. విష‌య‌మేంటంటే..! ప్ర‌పంచంలోని చిన్నారి ఊబ‌కాయుల‌లో అధిక‌భాగం ఐరోపాలోనే ఉన్నార‌ని ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ (డ‌బ్ల్యూహెచ్ఓ) తాజాగా వెల్ల‌డించింది. 0-3 ఏళ్ల‌లోపు బాల‌ల్లో ఎంత‌మంది ఊబ‌కాయ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారో స‌ర్వే చేసి జాబితా విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం.. 27 శాతంతో ఐర్లాండ్ మొద‌టి స్థానంలో, ర‌వి అస్త‌మించ‌ని సామ్రాజ్యంగా పేరొందిన‌ బ్రిట‌న్ 23 శాతంతో రెండోస్థానంలో నిలిచింది. త‌రువాత స్థానంలో అల్బేనియా, బ‌ల్గేరియా, స్పెయిన్ దేశాలు నిలిచాయి. ఇప్ప‌టికే ఊబ‌కాయుల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న బ్రిట‌న్ ను ఈ వార్త మ‌రింత క‌ల‌వ‌ర‌పెడుతోంది. దీనిపై బ్రిట‌న్‌లో ఇప్ప‌టికే పోష‌కాహార నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అధిక‌బ‌రువుకు కార‌ణ‌మ‌వుతున్న జంక్‌ఫుడ్‌, డ్రింకుల‌ను నిషేధించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే 15 ఏళ్ల‌లో బ్రిట‌న్‌లో ఊబ‌కాయుల స‌మ‌స్య మ‌రింత పెరిగిపోతుంది. ఫ‌లితంగా వారంతా గుండె, డ‌యాబెటిస్‌, ఇత‌ర వ్యాధుల బారిన ప‌డతార‌ని బ్రిట‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది.
First Published:  7 May 2015 11:21 PM GMT
Next Story