Telugu Global
Others

తెలంగాణ 5 గ్రామాల్లో రాహుల్ పాదయాత్ర

కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ తెలంగాణ‌లో పాద‌యాత్ర చేయ‌డానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఐదు గ్రామాల్లో ఆయన 15 కిలోమీటర్ల మేర పాద‌యాత్ర చేస్తారు. రైతులను, స్వయం సహాయక సంఘాల మహిళలను కలుస్తారు. వారి కష్టసుఖాలు తెలుసుకుంటారు. ఈ విష‌యాన్ని రాహుల్‌ కార్యాలయం అధికారికంగా తెలిపింది. ‘ఆఫీస్‌ ఆఫ్‌ ఆర్జీ’ పేరిట రాహుల్‌ కార్యాలయం ట్విట్టర్‌ అకౌంట్‌ ప్రారంభించింది. తొలిరోజు అందులో ప్రధాన అంశం రాహుల్‌ తెలంగాణ పర్యటనే. ఇందులో భాగంగా వడియాల్‌, రాచపూర్‌, పొట్టుపల్లి, […]

తెలంగాణ 5 గ్రామాల్లో రాహుల్ పాదయాత్ర
X
కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ తెలంగాణ‌లో పాద‌యాత్ర చేయ‌డానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఐదు గ్రామాల్లో ఆయన 15 కిలోమీటర్ల మేర పాద‌యాత్ర చేస్తారు. రైతులను, స్వయం సహాయక సంఘాల మహిళలను కలుస్తారు. వారి కష్టసుఖాలు తెలుసుకుంటారు. ఈ విష‌యాన్ని రాహుల్‌ కార్యాలయం అధికారికంగా తెలిపింది. ‘ఆఫీస్‌ ఆఫ్‌ ఆర్జీ’ పేరిట రాహుల్‌ కార్యాలయం ట్విట్టర్‌ అకౌంట్‌ ప్రారంభించింది. తొలిరోజు అందులో ప్రధాన అంశం రాహుల్‌ తెలంగాణ పర్యటనే. ఇందులో భాగంగా వడియాల్‌, రాచపూర్‌, పొట్టుపల్లి, లక్ష్మణ్‌చందా, కొరటికల్‌ గ్రామాల్లో పర్యటిస్తారని, వడియాల్‌లో పాదయాత్ర మొదలు పెడతారని 15 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారని వివరించింది. ఇది రాహుల్‌ వ్యక్తిగత ట్విట్టర్‌ అకౌంట్‌ కాదని, ఆయన తరఫున ఇందులో కార్యాలయ సిబ్బంది ట్వీట్లు చేస్తారని స్పష్టం చేసింది.
కాగా, రైతులకు న్యాయం చేయడానికి, వారిలో భరోసా నింపడానికే రాహుల్‌ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పార్టీ నేతలు భట్టి విక్రమార్క, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, బలరాం నాయక్‌, గీతారెడ్డిలతో కలిసి ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతులకు భరోసా ఇవ్వడానికే రాహుల్‌ పర్యటిస్తున్నారని తెలిపారు. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్‌ పర్యటనను పెట్టించాలంటూ వర్సిటీ విద్యార్థులు, విద్యార్థి జేఏసీ నాయకులు గాంధీ భవన్‌లో టీపీసీసీ నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రస్తుత పర్యటన రైతుల కోసమే పరిమితం చేయాలని రాహుల్‌ స్పష్టం చేశారని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వారికి వివరించారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో తనను కలుసుకోవాలని రాహుల్‌ సూచించారని చెప్పగా.. అందుకు విద్యార్థులు తిరస్కరించినట్లు తెలిసింది.
First Published:  7 May 2015 9:21 PM GMT
Next Story