శృతి హాస‌న్ కు అదే బాగా ఇష్ట‌మ‌ట‌…!

స్టార్ హీరోయిన్ లీగ్ లో ఎంట్రీ కొట్ట‌డం ఒకెత్తు అయితే దాన్ని నిలుపుకోవ‌డం మ‌రొక ఎత్తు. వ‌రస గెలుపులు లేకపోతే ఆ లీగ్ నుంచి టెర్మి నేట్ అయిన‌ట్లే. అయితే ప్ర‌స్తుతం హాట్ బ్యూటీ శృతి హాస‌న్ కూ కెరీర్ ప‌రంగా హండ్రెడ్ ప‌ర్సెంట్ స‌క్సెస్ తో ట్రావెల్ అవుతున్న స‌మ‌యం ఇది. తెలుగు, త‌మిళ్, హింది లాంగ్వేజెస్ లో చిత్రాలు చేస్తూ బిజీ గా ఉంది. కట్ చేస్తే అవ‌కాశాల ప‌రంగా మీకు ఏది బాగా ఇష్టం…. అంటే అవ‌కాశాల కోసం మీరు ప్ర‌య‌త్నించడమా లేకపోతే అవ‌కాశాలు మిమ్మల్నే వెతుకుంటూ రావ‌డం మీకు ఇష్ట‌మా అని మీడియా వారు అడిగితే…ఆ రెండ కాదు.. మంచి క‌థ వున్న చిత్రంలో ఆఫ‌ర్ రావ‌డం చాలా సంతోషం మరియు ఇష్టమని చెబుతుందీ ముద్దుగుమ్మ.

త‌ను చేసే సినిమా మ‌న‌సుకు న‌చ్చితేనే చేస్తుంద‌ట‌. కేవ‌లం ఖాళీగా ఉండ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యంతో త‌ను సినిమాలు చేయ‌న‌ని తేల్చి చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను చేసిన సినిమాల‌న్నీ త‌న మన‌సుకు ఇష్ట‌మైన చిత్రాలేన‌ని క్లారీటి ఇచ్చింది. అందుకే త‌న మీద త‌న‌కు ఎటువంటి ఫిర్యాదులు లేవ‌ని కూడా చెప్పింది. ప్రస్తుత్తం తెలుగులో మ‌హేష్ బాబు స‌ర‌స‌న హీరోయిన్ గా శ్రీ‌మంతుడు చిత్రంలో న‌టిస్తుంది.