నన్ను కంట్రోల్ చేయ‌లేరు-త్రిష‌

త్రిష ఎంగేజ్ మెంట్ బ్రేక‌ప్ కావ‌డం వెన‌క ప‌లు కార‌ణాలున్న‌ట్లు తెలుస్తుంది. కొంద‌రు త్రిష‌కు కాబోయో వాళ్ల ఫ్యామిలీ అంతా త్రిష‌ను కంట్రోల్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. కంట్రోల్ అంటే.. త‌ను సినిమాలు చేయ‌కూడ‌ద‌ని.. వాళ్లు చెప్పిన‌.. పెట్టిన ప‌రిమితుల మేర‌కే త్రిష న‌డుచుకోవాలట‌.. అలాగే వ‌రుణ్ మ‌ణియ‌న్ దానికి వ‌త్తాసు ప‌లికిన‌ట్లు తెలుస్తుంది. వ‌రుణ్ మ‌ణియ‌న్ తో పాటు.. వాళ్ల ఫ్యామిలీ అంతా మ్యారేజ్ అయిన వెంట‌నే త్రిష సినిమాల‌కు స్వస్తి చెప్పాల‌ని ప‌ట్టు ప‌ట్ట‌డం ప్రాధమిక కార‌ణంగా వినిపిస్తుంది. పెళ్లికి ముందే ఇన్ని అంక్ష‌లు పెడ‌తుంటే.. పెళ్లి అయిన త‌రువాత మ‌రెన్ని ఆంక్షలు పెడతారో అని త్రిష తెలివిగా షాది కి ముందే తెగ‌తెంపులు చేసుకున్న‌ట్లు తెలుస్తుంది. త్రిష వంటి సెల్ఫ్ ఇండిపెండెన్స్ వున్న అమ్మాయిల‌పై ఇన్ని ప‌రిమితులు పెడితే భ‌రిస్తారా..! అసాధ్యం క‌దా. ? ఇవ‌న్ని పూర్తిగా నిజం కాక పోవ‌చ్చు..అలా అని పూర్తిగా అబ‌ద్దం కాక పోవ‌చ్చు అంటున్నారు ప‌రిశీల‌కులు. త‌న‌కు ఇంత కీర్తి, ధ‌నం తెచ్చిన సినిమాల్ని ఒకేసారి వ‌ద‌లుకోవాలంటే ఎవ‌రికైన క‌ష్ట‌మే క‌దా.?