ల‌క్ష్మీ  దొంగాట  క్యాష్ తెస్తుందా! 

ఏ విష‌యంలో అయిన వాస్త‌వాలు మాట్లాడుకుంటే చాలా బెట‌ర్ అంటారు ప‌దార్ద భౌతిక వాదులు.  మంచు ల‌క్ష్మీ కూడా  ఆ వ‌ర్గానికి చెందిన  వ్యక్తే అన‌డంలో సందేహాం లేదు. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు  త‌ను చేసిన చిత్రాల‌కు మంచి పేరు అయితే వ‌చ్చింది కానీ..  కాసులు మాత్రం రాలేద‌ని చెప్పింది.  తాజాగా త‌ను న‌టించి నిర్మించిన దొంగాట చిత్రం ఈ రోజు  విడుద‌ల‌య్యింది.  ఈ చిత్రం రిలీజ్ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో  ల‌క్ష్మీ ప్ర‌స‌న్న  త‌న‌కు  అవార్డ్ అవ‌స‌రం లేదు కానీ..  త‌న చిత్రానికి క్యాష్  రావాల‌నే  కోరిక‌ను ఓపెన్ గానే వ్య‌క్త ప‌రిచింది.
నిజంగానే దొంగాట  సినిమాకు  క్యాష్ వ‌సూలు చేసే స‌త్తా ఉందంటున్నారు చిత్ర యూనిట్. పూర్తిగా వినోదాత్మ‌కంగా కొత్త ద‌ర్శ‌కుడు వంశీకృష్ణ దొంగాట సినిమాను చేశారు.  ఒక సాంగ్ లో  టాలీవుడ్  హీరోల్లో స‌గం మంది క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో ల‌క్ష్మీ,  అడ‌విశేషు లీడ్ రోల్స్ చేయ‌గా.. బ్ర‌హ్మీ  ఫుల్ లెంగ్త్  కామెడి రోల్ చేశారు. రానా గెస్ట్ రోల్ చేశారు.  మొత్తం మీద దొంగాట చిత్రం పై ల‌క్ష్మీ ప్ర‌స‌న్న  పెట్టుకున్న అంచ‌నాలు నిజం కావాలని ఆశిద్దాం.