శ్రేయ కొత్త పాత్రలతో అలరించనుందా ?

2001 లో ఇష్టం సినిమాతో హిరోయిన్ గా అడుగు పెట్టింది శ్రేయ శరన్. తన నటనతో చాలా తొందరగానే అందరి మనసులను దోచుకొని, తక్కువ కాలం లోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఆ తరవాత దాదాపు అందరిస్టార్ హీరోల సరసన నటించేసింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి పెద్ద హీరోల తోనూ, మహేష్ బాబు, జూ.ఎన్టీర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి ఆ తరం వాళ్ళతో, ఇలా అందరితో నటించే అవకాసం ఒక్క శ్రేయా కే దక్కింది. కాని ఇప్పుడు పరిస్తితి మొత్తం తారుమారు అయ్యింది.
దాదాపు 14 ఏళ్ళు హీరోయిన్ గా ఉండటం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ కి 5, 6 సంవత్సరాలు దాటితే చాలు ఇక ఆ హీరోయిన్ పని అయిపోయినట్లే. ఇంత పోటీ లో కుడా శ్రేయ తట్టుకొని నిలబడింది అంటే అది తన టాలెంట్ పైనే అని చెప్పచ్చు. ఇక అవకాశాలు పూర్తిగా తగ్గుతున్న సమయంలో ‘మనం ‘ సినిమాలో నాగార్జున పక్కన నటించడం ఈమెకు ప్లస్ అయ్యింది. ఆ తర్వాత వెంటనే ‘గోపాల గోపాల ‘ సినిమా కూడా చేసేసింది. కానీ పెద్ద హీరోల పక్కన మాత్రమే శ్రేయ సరిపోతుంది అని ఫిక్స్ అయ్యారు. అది కూడా నిజమే అనుకోండి, కాకపోతే శ్రేయ మనసులో ఇంకా తను హీరోయిన్ అనే ఫీలింగ్ ఉండి ఉంటుంది. ఇక గోపాల గోపాల తర్వాత తన సినిమాలు ఏమి లేవు ఏ భాషల్లో కూడా. మరి ఈ పరిస్తితిని అర్థ చేసుకొని ఇక సినిమాలకి పుల్ స్టాప్ పెడుతుందా లేక విభిన్న పాత్రలతో ప్రేకక్షకులకు దగ్గరవుతుందా అని వేచి చూడాలి…