Telugu Global
Others

లంచమడిగితే తాట తీస్తా: చ‌ంద్ర‌బాబు

పాసుపుస్తకాల విషయంలో రెవెన్యూ అధికారులు తిప్ప్ట్జికుంటున్నారని ఓ రైతు ఫిర్యాదు చేయగా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు తీవ్రంగా స్పందించారు. ‘‘43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాను. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఇచ్చాను. కార్పొరేట్‌ కంపెనీలతో సమానంగా జీతాలు ఇస్తున్నాను. ఇంకా ఏమి కావాలన్నా చేస్తాను. కానీ, సామాన్య ప్రజల నుంచి ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినా క్షమించేది లేదు’’ అని అధికారులను ఉద్దేశించి చంద్రబాబు హెచ్చరించారు. ఐదారు నెలల్లో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని, కులం, నేటివిటీ, బర్త్‌ సర్టిఫికెట్లన్నింటికీ కలిపి […]

పాసుపుస్తకాల విషయంలో రెవెన్యూ అధికారులు తిప్ప్ట్జికుంటున్నారని ఓ రైతు ఫిర్యాదు చేయగా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు తీవ్రంగా స్పందించారు. ‘‘43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాను. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఇచ్చాను. కార్పొరేట్‌ కంపెనీలతో సమానంగా జీతాలు ఇస్తున్నాను. ఇంకా ఏమి కావాలన్నా చేస్తాను. కానీ, సామాన్య ప్రజల నుంచి ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినా క్షమించేది లేదు’’ అని అధికారులను ఉద్దేశించి చంద్రబాబు హెచ్చరించారు. ఐదారు నెలల్లో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని, కులం, నేటివిటీ, బర్త్‌ సర్టిఫికెట్లన్నింటికీ కలిపి ఒకే కార్డును ఇవ్వాలనే ఆలోచన ఉందన్నారు. కొంతమంది పనితీరు వల్ల మొత్తం ఆ శాఖలకే చెడ్డపేరు వస్తోందని, వారి విషయం తన దృష్టికి వస్తే మాత్రం వదిలిపెట్టనన్నారు. నెల రోజుల్లో ఉద్యానపంటలకు రుణమాఫీ వర్తింపజేస్తానని హామీ ఇచ్చారు. ఎకరాకు పదివేల చొప్పున రుణ మాఫీ చేస్తానని, నెల రోజుల్లోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేస్తానని తెలిపారు.
వైఎస్‌ ప్రభుత్వం అడ్డగోలు చర్యలతోనే రాష్ట్రానికి కరువొచ్చిందని, అప్పుడు ఆయన సక్రమంగా పనిచేసిఉంటే రైతుల బతుకులు ఇలా ఉండేవి కావని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో సాగునీటి ప్రాజెక్టుల ను పట్టించుకోలేదు. అలాగని ఇప్పుడు మేం చేస్తామంటే వైసీపీ నేత జగన్‌ గుండెలు బాదుకొంటున్నారు. ఆయన సొంత నియోజకవర్గం పులివెందులకు నీళ్లిస్తామన్నా కుదరదని అడ్డుపడుతున్నారు. ఇలాంటివాడు రాష్ర్టానికి ఏం మేలు చేస్తారు’’ అని దుయ్యబట్టారు.
First Published:  7 May 2015 5:05 PM GMT
Next Story