Telugu Global
National

ర‌క్ష‌ణ‌శాఖ‌లో తుప్పు ప‌ట్టిన ఆయుధాలు!

రక్షణశాఖ పనితీరును, ఆయుధాల నిర్వహణ తీరును కాగ్‌ (కంప్ట్రోల‌ర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్) ఎండగట్టింది. మార్చి 2013 నాటికి, సకాలంలో మరమ్మతులు, నిర్వహణ లేక, మొత్తం ఆయుధాల్లో 17.5 శాతం పాడైపోయాయని కాగ్‌ తేల్చింది. తయారీ లోపాల వల్ల సుమారు రూ 1618 కోట్ల విలువైన ఆయుధాలు డిపోల్లో తుప్పుపట్టాయని, మరో రూ 814 కోట్ల విలువ చేసే ఆయుధాలను అధికారులే పనికిరానివని నిర్ధారించారని గుర్తించింది. అటు తేలికపాటి యుద్ధ విమానాల తయారీలో అలసత్వాన్నీ తప్పుబట్టింది. మార్క్‌-1 […]

రక్షణశాఖ పనితీరును, ఆయుధాల నిర్వహణ తీరును కాగ్‌ (కంప్ట్రోల‌ర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్) ఎండగట్టింది. మార్చి 2013 నాటికి, సకాలంలో మరమ్మతులు, నిర్వహణ లేక, మొత్తం ఆయుధాల్లో 17.5 శాతం పాడైపోయాయని కాగ్‌ తేల్చింది. తయారీ లోపాల వల్ల సుమారు రూ 1618 కోట్ల విలువైన ఆయుధాలు డిపోల్లో తుప్పుపట్టాయని, మరో రూ 814 కోట్ల విలువ చేసే ఆయుధాలను అధికారులే పనికిరానివని నిర్ధారించారని గుర్తించింది. అటు తేలికపాటి యుద్ధ విమానాల తయారీలో అలసత్వాన్నీ తప్పుబట్టింది. మార్క్‌-1 వెర్షన్‌లో 53 కీలక లోపాలను గుర్తించిన కాగ్‌, రెండో వెర్షన్‌లో అయినా మార్పులు చేయాలని, నిర్దిష్ట కాలపరమితిలో ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని రక్షణ శాఖకు సూచించింది.
First Published:  8 May 2015 5:20 PM GMT
Next Story