Telugu Global
Cinema & Entertainment

జ‌గ‌దేక వీరుడు " అస‌లోడు గుర్తున్నాడా ?

జ‌గ‌దేక‌వీరుడు -అతిలోక‌సుంద‌రి విడుద‌ల‌యి ఈ రోజుకి ( మే 9 ) పాతికేళ్ళు. ఈ సంద‌ర్భంగా సినిమా అభిమానులు , మీడియా ఆ సినిమా జ్ఞాప‌కాలు త‌లుచుకుంటున్నారు. టివిల్లో అద‌ర‌గొట్టేస్తున్నారు. చిరంజీవి, శ్రీ‌దేవి, కె. రాఘ‌వేంద్ర‌రావు, అశ్వ‌నీద‌త్, ఇళ‌య‌రాజా ల‌ను ప‌దే ప‌దే పొగుడుతున్నారు. కాని ఈ చిత్రానికి మూల‌మైన క‌ధా ర‌చ‌యిత శ్రీ‌నివాస చ‌క్ర‌వ‌ర్తి ని ఎవరూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ద‌ర్శ‌కుడు కె. రాఘ‌వేంద్ర‌రావుకి తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వెళ్ళేట‌ప్పుడు కూడా ఓ క‌ధా ర‌చ‌యిత‌ని తీసుకెళ్ళ‌డం […]

జ‌గ‌దేక వీరుడు  అస‌లోడు గుర్తున్నాడా ?
X

జ‌గ‌దేక‌వీరుడు -అతిలోక‌సుంద‌రి విడుద‌ల‌యి ఈ రోజుకి ( మే 9 ) పాతికేళ్ళు. ఈ సంద‌ర్భంగా సినిమా అభిమానులు , మీడియా ఆ సినిమా జ్ఞాప‌కాలు త‌లుచుకుంటున్నారు. టివిల్లో అద‌ర‌గొట్టేస్తున్నారు. చిరంజీవి, శ్రీ‌దేవి, కె. రాఘ‌వేంద్ర‌రావు, అశ్వ‌నీద‌త్, ఇళ‌య‌రాజా ల‌ను ప‌దే ప‌దే పొగుడుతున్నారు. కాని ఈ చిత్రానికి మూల‌మైన క‌ధా ర‌చ‌యిత శ్రీ‌నివాస చ‌క్ర‌వ‌ర్తి ని ఎవరూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ద‌ర్శ‌కుడు కె. రాఘ‌వేంద్ర‌రావుకి తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వెళ్ళేట‌ప్పుడు కూడా ఓ క‌ధా ర‌చ‌యిత‌ని తీసుకెళ్ళ‌డం అల‌వాటు. అలా ఒక‌సారి ర‌చ‌యిత శ్రీ‌నివాస చ‌క్ర‌వ‌ర్తిని తీసుకెళ్ళారు. దారిలో జ‌గ‌దేక‌వీరుడు కధ చెప్పాడు శ్రీ‌నివాస‌చ‌క్ర‌వ‌ర్తి. రాఘ‌వేంద్ర‌రావుకి అమితంగా న‌చ్చింది. వెంట‌నే యండ‌మూరి వీరేంద్ర నాధ్ , స‌త్య మూర్తి ( సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్ తండ్రి ), శివ‌శ‌క్తి ద‌త్తా ( కీర‌వాణి తండ్రి ), విజ‌యేంద్ర ప్ర‌సాద్ ( రాజ‌మౌళి తండ్రి) , క్రేజీ మోహ‌న్ ( క‌మ‌ల్ హాస‌న్ ప‌ర్మినెంట్న్ రైట‌ర్ ) , అనంత్ ( కె. బాల‌చంద‌ర్ ప‌ర్మినెంట్ రైట‌ర్ ) ల‌తో క‌లిసి మొత్తం సినిమా స్క్రిప్ట్ రె డీ చేశారు.

శ్రీ‌నివాస చ‌క్ర‌వ‌ర్తి త‌ర్వాత పెళ్ళి , దొంగోడొచ్చాడు మొద‌ల‌యిన సినిమాల‌కు క‌ధ‌లు అందించారు. ఒక నాటి హీరోయిన్ ప‌ద్మ ప్రియ ని పెళ్ళాడారు.
కార‌ణాలేమ‌యి నా కాని శ్రీ‌నివాస చ‌క్ర‌వ‌ర్తి ఈ రోజు క్ర‌ష్ణాన‌గ‌ర్ రోడ్ల మీదికొచ్చారు. జీవితం గ‌డ‌ప‌ట‌మే క‌ష్ఠంగా ఉంద‌ని పేప‌ర్ల‌లో ఆ మ‌ధ్య వార్త‌లొచ్చాయి. క‌నీసం ఈ సంద‌ర్భంగా నైనా జ‌నం కాక‌పోయినా యూనిట్ అయినా ఆ ర‌చ‌యితని త‌లుచుకున్నారో – లేదో ?

First Published:  9 May 2015 9:02 AM GMT
Next Story