Telugu Global
Cinema & Entertainment

బాహుబ‌లి క‌థ‌కు కీల‌కం ర‌మ్య‌కృష్ణ ..!

రెండున్న‌రేళ్లుగా బాహుబ‌లి కోసం ప‌ని చేస్తున్న వారిని ముందుకు న‌డిపించిన శ‌క్తి శివ‌గామి అని రాజ‌మౌళి రాశారు. బాహుబ‌లి లో ప్ర‌ధాన పాత్ర‌ల తొలిచూపు ను రిలీజ్ చేస్తూ ఆ పాత్ర‌ల సారాంశాని రాస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌భాస్, అనుష్క ల గురించి పోస్ట‌ర్స్ రిలీజ్ చేసిన రాజ‌మౌళి శుక్ర‌వారం ర‌మ్య‌కృష్ణ ఫ‌స్ట్ లుక్ ను సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో విడుద‌ల చేసి .. న్యాయనికి సారాంశం అనే అర్ధం వ‌చ్చే విధంగా వ్యాఖ్య‌నం […]

బాహుబ‌లి క‌థ‌కు కీల‌కం ర‌మ్య‌కృష్ణ ..!
X

రెండున్న‌రేళ్లుగా బాహుబ‌లి కోసం ప‌ని చేస్తున్న వారిని ముందుకు న‌డిపించిన శ‌క్తి శివ‌గామి అని రాజ‌మౌళి రాశారు. బాహుబ‌లి లో ప్ర‌ధాన పాత్ర‌ల తొలిచూపు ను రిలీజ్ చేస్తూ ఆ పాత్ర‌ల సారాంశాని రాస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప్ర‌భాస్, అనుష్క ల గురించి పోస్ట‌ర్స్ రిలీజ్ చేసిన రాజ‌మౌళి శుక్ర‌వారం ర‌మ్య‌కృష్ణ ఫ‌స్ట్ లుక్ ను సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో విడుద‌ల చేసి .. న్యాయనికి సారాంశం అనే అర్ధం వ‌చ్చే విధంగా వ్యాఖ్య‌నం రాశారు. సాటిలేని శ‌క్తికి, ఓత‌ల్లి స‌హ‌నానికి ప్ర‌తిరూపం అంటూ ఈ సినిమాను హిందీలో విడుద‌ల చేస్తున్న ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ట్విట్ చేసింది. ఈ నెల 31న ట్రైల‌ర్.. జూలై 10న బాహుబ‌లి ఫ‌స్ట్ పార్ట్ ను ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి స‌న్న‌ద్దం చేస్తున్న విష‌యం తెలిసిందే. మొత్తం మీద ర‌మ్య‌కృష్ణ అసాధార‌ణ ప్ర‌తిభ వున్న న‌టి అని తేల్చారు. అన్నింటికి మించి ఈ సిసినిమాలో శివ‌గామి కీ రోల్ అని తెలుస్తుంది . ఈ పాత్ర‌ను ర‌మ్య‌కృష్ణ మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు అన్నంతగా చేసిన‌ట్లు చిత్ర యూనిట్ టాక్.

First Published:  8 May 2015 11:13 PM GMT
Next Story