Telugu Global
Cinema & Entertainment

అంద‌మొక్క‌టే స‌రిపోదు..! 

 ఏ రంగంలో అయిన  చివ‌ర‌కు తాము ఏ స్థాయికి చేరుకోగ‌ల‌ము అన్న విష‌యం ముందుగా  చాల త‌క్కువ మంది  మాత్ర‌మే ఊహించ గ‌లుగుతారు.అది వారి టాలెంట్ మీద వారికి వున్న న‌మ్మ‌కానికి ప్ర‌తీక అన‌డం క‌రెక్ట్.  ఇదే త‌ర‌హాలో హాట్ బ్యూటీ ర‌కుల్ ప్రీతిసింగ్  త‌ను ప్ర‌స్తుతం వున్న స్థానం  త‌ను హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న‌ప్పుడే ఊహించింద‌ట‌. స్వ‌తహాగా గోల్ఫ్  క్రీడాకారిణి అయిన  ర‌కుల్ ప్రీతిసింగ్..  గొప్ప న‌టి అవుతాన‌ని స్నేహితుల‌తో చెబుతుండేద‌ట‌. అన్న‌ట్లుగానే చాల […]

అంద‌మొక్క‌టే స‌రిపోదు..! 
X
ఏ రంగంలో అయిన చివ‌ర‌కు తాము ఏ స్థాయికి చేరుకోగ‌ల‌ము అన్న విష‌యం ముందుగా చాల త‌క్కువ మంది మాత్ర‌మే ఊహించ గ‌లుగుతారు.అది వారి టాలెంట్ మీద వారికి వున్న న‌మ్మ‌కానికి ప్ర‌తీక అన‌డం క‌రెక్ట్. ఇదే త‌ర‌హాలో హాట్ బ్యూటీ ర‌కుల్ ప్రీతిసింగ్ త‌ను ప్ర‌స్తుతం వున్న స్థానం త‌ను హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న‌ప్పుడే ఊహించింద‌ట‌. స్వ‌తహాగా గోల్ఫ్ క్రీడాకారిణి అయిన ర‌కుల్ ప్రీతిసింగ్.. గొప్ప న‌టి అవుతాన‌ని స్నేహితుల‌తో చెబుతుండేద‌ట‌. అన్న‌ట్లుగానే చాల త‌క్కువ స‌మ‌యంలోనే ఈ హాట్ బ్యూటీకి అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించే ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. అభిమానులు త‌న గ్లామ‌రనే కాకుండా.. న‌టిగా కూడా వారు స్వీక‌రిస్తున్నార‌ని సంతోష ప‌డుతుంది. హీరోయిన్ గా ప‌ది కాల‌ల పాటు ఇండ‌స్ట్రీలో కంటిన్యూ కావాలంటే కేవ‌లం గ్లామ‌ర్ నే న‌మ్మ‌కుంటే సాధ్య ప‌డ‌దనే విష‌యాన్ని త్వ‌ర‌గానే ఈ సెక్సీ బ్యూటీ గ్ర‌హించిన‌ట్లుంది మ‌రి. హీరోయిన్ గా ఎన్టీఆర్, రాంచ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.
First Published:  8 May 2015 4:16 PM GMT
Next Story