Telugu Global
Health & Life Style

గోధుమగడ్డితో సంపూర్ణ ఆరోగ్యం

 ప్రతిరోజూ ఓ గ్లాసు గోధుమ గడ్డి జ్యూస్ తాగితే సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఆకుపచ్చని ఈ జ్యూసు ఎర్రని రక్తంగా మారిపోతుంది. గోధుమగడ్డి చేసే మేళ్లేమిటో చూద్దాం…  – గోధుమగడ్డి జ్యూస్ తాగడం వల్ల రక్తహీనత సమస్య పూర్తిగా తొలగిపోతుంది. మన శరీరానికి తగినంత హెమొగ్లోబిన్‌ను ఇది అందిస్తుంది.  – మన శరీరానికి కావలసినంత క్లోరోఫిల్ అందుతుంది. గోధుమగడ్డి జ్యూస్ ద్వారా లభించే క్లోరోఫిల్ ప్రత్యేక కణాలను క్లోరో ప్లాసిస్ అంటారు. అవి ఆరోగ్యానికి […]

గోధుమగడ్డితో సంపూర్ణ ఆరోగ్యం
X
ప్రతిరోజూ ఓ గ్లాసు గోధుమ గడ్డి జ్యూస్ తాగితే సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఆకుపచ్చని ఈ జ్యూసు ఎర్రని రక్తంగా మారిపోతుంది. గోధుమగడ్డి చేసే మేళ్లేమిటో చూద్దాం…
– గోధుమగడ్డి జ్యూస్ తాగడం వల్ల రక్తహీనత సమస్య పూర్తిగా తొలగిపోతుంది. మన శరీరానికి తగినంత హెమొగ్లోబిన్‌ను ఇది అందిస్తుంది.
– మన శరీరానికి కావలసినంత క్లోరోఫిల్ అందుతుంది. గోధుమగడ్డి జ్యూస్ ద్వారా లభించే క్లోరోఫిల్ ప్రత్యేక కణాలను క్లోరో ప్లాసిస్ అంటారు. అవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
– క్లోరోఫిల్ రక్తాన్ని శుద్ధి చేయడానికి, గుండె సరిగ్గా పనిచేయడానికి ఉపకరిస్తుంది.
– మన రక్తంలో రసాయనాల చర్య ఒక ఆల్కలైన్‌లా ఉంటుంది. హైడ్రోజన్ మాలిక్యూల్‌కి గోధుమగడ్డి జ్యూస్ రక్తంలో సులభంగా కలసిపోతుంది.
– ఊపిరితిత్తులు, మూత్రపిండాలు మరింత బలోపేతమవుతాయి. మెరుగ్గా పనిచేస్తాయి.
– గోధుమగడ్డి జ్యూస్‌లో విటమిన్ ఇ, ఎ,సి లు కూడా ఉంటాయి.
– చర్మ సంబంధ అలర్జీలు, జుట్టు తెల్లబడడం, రాలిపోవడం, నీరసం, కిడ్నీలో రాళ్లు, చూపు మందగించడం, దంతాల బలహీనత వంటి సమస్యలకు ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది.
First Published:  8 May 2015 9:08 PM GMT
Next Story