Telugu Global
Others

కేంద్రం స్ఫూర్తితో రాష్ట్రంలోనూ కొత్త పథకాలు: చంద్రబాబు

కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ‘‘జీవన్‌ జ్యోతి బీమా యోజన’’, ‘‘సురక్షా బీమా యోజన’’, ‘‘అటల్‌ పెన్షన్‌ యోజన’’ పథకాలను సీఎం చంద్రబాబు, కేంద్ర రక్షణ మంత్రి పారికర్‌ విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ.. ఒకేసారి మూడు రకాల సోషల్‌ సెక్యూరిటీ పథకాలు ప్రారంభించడం శుభపరిణామం అని అన్నారు. రాష్ట్రంలో తాము కూడా రెండు పథకాలు ప్రవేశపెడుతున్నామని చంద్రబాబు వెల్లడించారు. డైవ్రర్లకు బీమా పథకాలు ప్రారంభిస్తున్నామని, డ్రైవర్ల పిల్లలకు నెలకు 12 వందలు స్కాలర్‌ షిప్‌ […]

కేంద్రం స్ఫూర్తితో రాష్ట్రంలోనూ కొత్త పథకాలు: చంద్రబాబు
X
కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ‘‘జీవన్‌ జ్యోతి బీమా యోజన’’, ‘‘సురక్షా బీమా యోజన’’, ‘‘అటల్‌ పెన్షన్‌ యోజన’’ పథకాలను సీఎం చంద్రబాబు, కేంద్ర రక్షణ మంత్రి పారికర్‌ విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ.. ఒకేసారి మూడు రకాల సోషల్‌ సెక్యూరిటీ పథకాలు ప్రారంభించడం శుభపరిణామం అని అన్నారు. రాష్ట్రంలో తాము కూడా రెండు పథకాలు ప్రవేశపెడుతున్నామని చంద్రబాబు వెల్లడించారు. డైవ్రర్లకు బీమా పథకాలు ప్రారంభిస్తున్నామని, డ్రైవర్ల పిల్లలకు నెలకు 12 వందలు స్కాలర్‌ షిప్‌ ఇస్తున్నామని, అదేవిధంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకూ ఓ పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. పేదవారికి పెన్షన్‌ను ఐదు రెట్లు పెంచి ఇస్తున్నామని సీఎం గుర్తుచేశారు. డ్వాక్రా సంఘాల సభ్యులకు రూ. 10 వేల చొప్పున ఇస్తున్నామని, పాత బకాయిలను మాఫీ చేస్తున్నామని ఆయన వివరించారు. అదేవిధంగా రైతుల రుణాలను మాఫీ చేశామని పేర్కొన్నారు. ప్రతీ మనిషి జీవితానికి ఈ పథకాలు భద్రత కలిగిస్తాయని, ఇది నూతన అధ్యాయానికి శ్రీకారం అని ప్రశంసించారు. పేదవారి బ్రతుకుల్లో భరోసా కల్పించేలా ఉన్నాయని అన్నారు. పేదవారి కష్టాలను తీర్చేందుకు తమ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ పథకాలకు డ్వాక్రా సంఘాలు, పంచాయతీలు ప్రచారం చేపట్టాలని సూచించారు.
First Published:  9 May 2015 5:00 AM GMT
Next Story