నెక్ట్స్ సినిమా కి రెడీ  అవుతున్న నాని

ఒకే రోజు రెండు సినిమాలు ( జెండా పై క‌పిరాజు , ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం ) రిలీజ్ కావ‌డంతో ఫ్రీ అయిన నాని ఇప్పుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో భ‌లే భలే మ‌గాడివోయ్ సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. ఆ పినిమా డ‌బ్బింగ్ కూడా మొద‌లెట్టాడు.స‌మ్మ‌ర్ వెకేష‌న్ అని బ్యాంకాక్ వెళ్ళాడు. వ‌చ్చీ రాగానే మారుతి సినిమా సాంగ్స్ షూటింగ్ పూర్తి చేస్తాడు. ఆ వెంట‌నే అందాల రాక్ష‌సి డైరైక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో 14 రీల్స్ నిర్మించే చిత్రంలో ప‌టించ‌బోతున్నాడు నాని. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావ‌ల‌సి ఉంది. అయితే ఆగ‌డు దెబ్బ‌కి 14 రీల్స్ నిర్మాత‌లు
కొన్ని ఆర్ధిక ఇబ్బందుల్లో ప‌డటం వ‌ల్ల  ఈ సినిమా  షూటింగ్  లేట్ అయింది. అంతే కాదు, మ‌హేష్ బాబు బ్ర‌హ్మోత్స‌వం కూడా ఈ బేన‌ర్ లో నే జ‌ర‌గాలి. ఈ ఫైనాన్సియ‌ల్ స‌మ‌స్య‌ల వ‌ల్ల‌నే  ఆ ప్రాజెక్ట్ పివిపి సంస్ధ‌కి వెళ్ళింది.