టీవీ న‌టి రూప ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!

ప్రేమ వైఫల్యం కారణంగా మానసిక వ్యధకు గురై హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన టీవీ నటి రూప (28)ను లేక్‌వ్యూ పోలీసులు రక్షించారు. నటిగా రూప ఆర్జిస్తున్న పేరు ప్రతిష్టలను చూసి ఆమె వెంటపడిన సమీప బంధువు కేవల్ సింగ్ ఆమెతో సహజీవనం చేస్తూ వచ్చాడు. ఆమెతో కొంత‌కాలం తిరిగిన త‌ర్వాత సీరియల్స్‌లో నటించకూడదంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. పెళ్లి మాట ఎత్తేసరికి టీవీ నటిని పెళ్లి చేసుకోవడానికి తన కుటుంబం ఒప్పుకోవడం లేదంటూ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అతనిని ఒప్పించలేక విసిగిపోయిన రూప చివరికి హుస్సేన్‌సాగ‌ర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అదృష్టవశాత్తు పోలీసులు చూసి కాపాడారు. రూప సోదరుడిని పిలిపించి అత‌ని స‌మక్షంలో లేక్‌వ్యూ ఇనస్పెక్టర్ శ్రీదేవి కౌన్సిలింగ్ చేశారు. కేవల్ సింగ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా పేట్ బషీర్‌బాగ్ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. గత ఐదేళ్లుగా టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న రూప… చంద్రముఖి, ఆటోభారతి, అంతఃపురం, శిఖరం వంటి సీరియ‌ల్స్‌లో పలు పాత్రలు పోషించారు.