బాల‌య్య వందో సినిమా ఎప్పుడు ?

ఈ నెల 14 న విడుద‌ల‌వుతున్న ల‌య‌న్ బాల‌క్రిష్ణ 98 వ సినిమా. 99 వ సినిమాగా శ్రీ వాసు డిక్టేట‌ర్ వ‌చ్చే నెల నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. 100 వ సినిమా కు  సింహ‌, లెజెండ్ వంటి సూప‌ర్ హిట్స్ అందించిన బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌కుడు అనేది  దాదాపు ఫిక్స్ అయిన‌ట్లే. అయితే ప్ర‌స్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మే నెలాఖ‌రు నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇద‌య్యేట‌ప్ప‌టికి ఎంత లేద‌న్నా  ఈ ఏడాది పూర్త‌వుతుంది. ఆ త‌ర్వాత  త‌ప్ప‌నిస‌రిగా బోయ‌పాటి శ్రీ‌ను  బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ శ్రీ‌నివాస్ సినిమా డైరెక్ట్ చేయాలి. అద‌య్యేట‌ప్ప‌టికి 2016 దాదాపు పూర్త‌యిపోతుంది. మ‌రి బాల‌య్య వందో సినిమా ఎప్పుడు చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు బోయ‌పాటి శ్రీ‌ను.