అనుష్క బాగా ఓపెన్ అయిపోతుంది..

విరాట్ కోహ్లి తో ప్రేమలో ఉన్న అనుష్క శర్మ కి కొద్ది కొద్దిగా ధైర్యం పెరుగుతూ వస్తుంది. మొదట వీరిద్దరి రిలేషన్ ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడినా, తర్వాత మీడియా పుణ్యమా అని అంతా ఓపెన్ అయిపొయింది. అందరికి తెలిసిన తర్వాత కుడా అలాంటిది ఏమి లేదు అని చాలా కాలం నెట్టుకొచ్చారు. కాని ఆ మద్య ఒకసారి ‘అవును. నేను, విరాట్ రిలేషన్ లో ఉన్నాం. అది ఓపెన్ గా చెప్తే నా కెరీర్ కి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పలేదు..’ అని చెప్పడంతో ఒక్కసారిగా అందరు కామ్ అయిపోయారు.
కాని ఈ మద్య వరల్డ్ కప్ లో కోహ్లి ఫెయిల్ అవ్వడంతో, దానికి కారణం అనుష్కా నే అంటూ చాలా మంది విమర్శలు చేసారు. కానీ ఆ విమర్శలే మా బంధాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసాయి అని చెప్తుంది అనుష్క. ‘నాకు, విరాట్ కి చాలా దగ్గర పోలికు ఉన్నాయి. అందుకే తొందరగా కలిసిపోయాం.ఇద్దరం మద్య తరగతి నుండి వచ్చి కష్టపడిన వాళ్ళమే. మా అమ్మ, నాన్న, అన్నయ, విరాట్ మాటలకే నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తా’. మీరు మా గురించి ఎంత ఎక్కువ విమర్శలు చేస్తే మా రిలేషన్ అంత స్ట్రాంగ్ గా అవుతుంది అని చెప్పేస్తుంది. లవ్ లో ఉంటే ఇలాంటి మాటలే వస్తాయి మరి.!