Telugu Global
CRIME

చెయిన్ స్నాచ‌ర్ బాక‌ర్ అలీ అరెస్ట్‌

బాక‌ర్ అక్రం అలీ… ఈ పేరు పోలీసు రికార్డుల్లో ఎప్ప‌టి నుంచో నానుతోంది. ఎక్క‌డ చెయిన్ స్నాచింగ్ జ‌రిగినా పోలీసుల‌కు వెంట‌నే గుర్తొచ్చే పేరే ఇది. అంత‌ర్జిల్లా దొంగ‌లా మారిన ఈ నేర‌గాడు దొంగ సొత్తుతో వివిధ ప‌ట్ట‌ణాల్లో జ‌ల్సాలు చేయ‌డానికి అల‌వాటు ప‌డ్డాడు. క‌ర్ణాట‌క‌లోని బీద‌ర్‌కు చెందిన ఇత‌ను తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల‌ను ఎంచుకుని చెయిన్ స్నాచింగ్‌ల‌కు పాల్ప‌డ‌తాడు. హైద‌రాబాద్‌తోపాటు రంగారెడ్డి, సైబ‌రాబాద్‌, మెద‌క్ జిల్లాలో ఇత‌ని బారిన ప‌డిన వారంతా చెయిన్లు పోగొట్టుకున్న వాళ్ళే. […]

బాక‌ర్ అక్రం అలీ… ఈ పేరు పోలీసు రికార్డుల్లో ఎప్ప‌టి నుంచో నానుతోంది. ఎక్క‌డ చెయిన్ స్నాచింగ్ జ‌రిగినా పోలీసుల‌కు వెంట‌నే గుర్తొచ్చే పేరే ఇది. అంత‌ర్జిల్లా దొంగ‌లా మారిన ఈ నేర‌గాడు దొంగ సొత్తుతో వివిధ ప‌ట్ట‌ణాల్లో జ‌ల్సాలు చేయ‌డానికి అల‌వాటు ప‌డ్డాడు. క‌ర్ణాట‌క‌లోని బీద‌ర్‌కు చెందిన ఇత‌ను తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల‌ను ఎంచుకుని చెయిన్ స్నాచింగ్‌ల‌కు పాల్ప‌డ‌తాడు. హైద‌రాబాద్‌తోపాటు రంగారెడ్డి, సైబ‌రాబాద్‌, మెద‌క్ జిల్లాలో ఇత‌ని బారిన ప‌డిన వారంతా చెయిన్లు పోగొట్టుకున్న వాళ్ళే. ఇత‌నిపై దాదాపు వంద‌కు పైగా కేసులున్నాయి. మొత్తంమీద ఈరోజు పోలీసుల‌కు దొరికాడు. ఇత‌ని వ‌ద్ద నుంచి మూడున్న‌ర కేజీల విలువైన బంగారు గొలుసుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇత‌నిపై పీడీ యాక్టు పెట్టి విచార‌ణ జ‌రుపుతున్నారు. ఈ విచార‌ణ‌లో ఎక్క‌డెక్క‌డ చెయిన్ స్నాచింగ్‌ల‌కు పాల్ప‌డిందీ… ఎవ‌రెవ‌రు ఇతనితో భాగ‌స్వాములుగా ఉందీ… ఏ చెయిన్‌ను ఎక్క‌డ విక్ర‌యించిందీ లేదా తాక‌ట్టు పెట్టిందీ తెలిసే అవ‌కాశం ఉంది.

First Published:  10 May 2015 5:10 PM GMT
Next Story