Telugu Global
Cinema & Entertainment

పూరి డైరెక్షన్ లో 'ఆటో జానీ'గా చిరు యాక్షన్....

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిన త‌ర్వాత ఇప్ప‌టికి క‌థ‌, ద‌ర్శ‌కుడు, టైటిల్ ఖ‌రార‌య్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ 150వ సినిమాకు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. బీవీఎస్ ర‌వి క‌థ‌కు చిరంజీవి దాదాపు ఓ.కే. చేసిన‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ క‌బుర్లు. 2007 త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటున్న చిరంజీవి గ‌త పుట్టిన రోజు ఓ ప్ర‌క‌ట‌న చేస్తూ అభిమానుల కోరిక మేర‌కు త‌న‌కూ మ‌రో సినిమా చేసి 150వ సినిమా మార్కును అధిగ‌మించాల‌ని ఉన్న‌ట్టు చెప్పారు. […]

పూరి డైరెక్షన్ లో ఆటో జానీగా చిరు యాక్షన్....
X
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిన త‌ర్వాత ఇప్ప‌టికి క‌థ‌, ద‌ర్శ‌కుడు, టైటిల్ ఖ‌రార‌య్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ 150వ సినిమాకు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. బీవీఎస్ ర‌వి క‌థ‌కు చిరంజీవి దాదాపు ఓ.కే. చేసిన‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ క‌బుర్లు. 2007 త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటున్న చిరంజీవి గ‌త పుట్టిన రోజు ఓ ప్ర‌క‌ట‌న చేస్తూ అభిమానుల కోరిక మేర‌కు త‌న‌కూ మ‌రో సినిమా చేసి 150వ సినిమా మార్కును అధిగ‌మించాల‌ని ఉన్న‌ట్టు చెప్పారు. అప్ప‌టి నుంచి దీనిపై అనేక ఊహాగానాలు వ‌స్తున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టికి ఒక క‌థ ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. చిరంజీవి న‌టించ‌బోతున్న ఈ 150వ సినిమా పేరు కూడా దాదాపు ఖ‌రారైంది. దీనిపేరు ఆటో జానీ… ఈ విష‌యాల‌న్నీ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాడు చిరంజీవి త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ తేజ. చిరంజీవి సినిమాకు నిర్మాత కూడా ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణేన‌న్న‌ది ఇప్ప‌టికే ఖరారైంది.
First Published:  11 May 2015 1:08 AM GMT
Next Story