Telugu Global
Others

టీఆర్ ఎస్ " బీజేపీ డీల్ కుద‌రిందా?

    తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తుకు స‌ర్వం సిద్ధం చేసుకున్నార‌న్న వార్త‌లు గ‌తంలో వినిపించాయి. ఇప్పుడు ఆ వార్త‌ల‌కు ఊత‌మిచ్చేలా హైద‌రాబాద్‌లో పోలీసు శాఖ ఆధ్వ‌ర్యంలో స్వ‌చ్ఛ్ హైద‌రాబాద్‌ను శ‌నివారం నిర్వ‌హించారు. దీంతో టీఆర్ఎస్‌ – కేంద్రం దోస్తీ ఇక ఖ‌రార‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న ఊహాగానాలు ఊపంద‌కున్నాయి. ఈ సారి గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న టీఆర్ఎస్ విజ‌య‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతోంది. అందులో భాగంగానే తొలి నుంచి మ‌జ్లిస్‌తో స‌ఖ్య‌త‌గా […]

టీఆర్ ఎస్  బీజేపీ డీల్ కుద‌రిందా?
X

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తుకు స‌ర్వం సిద్ధం చేసుకున్నార‌న్న వార్త‌లు గ‌తంలో వినిపించాయి. ఇప్పుడు ఆ వార్త‌ల‌కు ఊత‌మిచ్చేలా హైద‌రాబాద్‌లో పోలీసు శాఖ ఆధ్వ‌ర్యంలో స్వ‌చ్ఛ్ హైద‌రాబాద్‌ను శ‌నివారం నిర్వ‌హించారు. దీంతో టీఆర్ఎస్‌ – కేంద్రం దోస్తీ ఇక ఖ‌రార‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న ఊహాగానాలు ఊపంద‌కున్నాయి. ఈ సారి గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న టీఆర్ఎస్ విజ‌య‌మే ల‌క్ష్యంగా పావులు క‌దుపుతోంది. అందులో భాగంగానే తొలి నుంచి మ‌జ్లిస్‌తో స‌ఖ్య‌త‌గా మెల‌గుతోంది. దీనిపై బీజేపీ విమ‌ర్శ‌లు చేసినా పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ, రాష్ట్రంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌ల‌పెట్టిన మిష‌న్ కాక‌తీయ‌, వాట‌ర్‌గ్రిడ్ ప‌థ‌కాల‌కు కేంద్రం నుంచి భారీగా నిధులు కావాలి. ఇందుకోసం బీజేపీతో దోస్తీ త‌ప్ప‌నిస‌రి అయింది. కేంద్రంలో త‌మ మంత్రుల‌తో గ‌ట్టిగా లాబీయింగ్ చేస్తున్న చంద్ర‌బాబుకు చెక్ పెట్టేంద‌కు త‌మ పార్టీ వ్య‌క్తులు సైతం కేంద్ర కేబినేట్‌లో ఉండాల‌ని కేసీఆర్ త‌ల‌చారని వార్త‌లు వ‌చ్చాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇద్ద‌రు బీజేపీ ఎమ్మెల్యేల‌కు రెండు మంత్రిప‌ద‌వులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపార‌ని, ప్ర‌తిగా టీఆర్ ఎస్‌కు కేంద్రంలో రెండు మంత్రి ప‌ద‌వుల‌కు ఒప్పందం జ‌రిగింద‌ని గుస‌గుస‌లు వినిపించాయి. నిజంగా ఈ ఎత్తు పారితే అసెంబ్లీలో టీడీపీని ఒంట‌రి చేయ‌వ‌చ్చు. ఒక‌రు ఇద్ద‌రు మిన‌హా అంద‌రినీ గులాబీ గూటికి తీసుకురావ‌చ్చ‌న్న‌ది కేసీఆర్ వ్యూహ‌మ‌ని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శ‌లు గుప్పించారు. వీటిని టీఆర్ ఎస్ సీరియ‌స్‌గా తీసుకోక‌పోవ‌డం ఇక్క‌డ గ‌మ‌నించాలి. రాజ‌కీయప‌రంగా ఇదేదీ అసాధ్యం కాదు. అలాగ‌ని జ‌ర‌గ‌కూడ‌ద‌న్న నిబంధ‌నేదీ లేదు. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌రు క‌దా!

First Published:  10 May 2015 10:50 PM GMT
Next Story