Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 79

ఆమె స్వెట్టర్‌ అల్లాలనుకుంది. షాపుకు వచ్చి ఒక కేజీ “వూలు” అడిగింది. షాపతను ఎందుకని అడిగాడు. “మా కుక్క పిల్లకు స్వెట్టర్‌ అల్లుదామనుకుంటున్నాను” అంది. “మీరా కుక్కపిల్లనే తీసుకొస్తే ఎంత వూలు అవసరమో నేను చెబుతాను” అన్నాడు షాపతను. “కుదరదండీ! నేను మా కుక్కపిల్లకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇద్దామనుకుంటున్నాను” అందామె. ————————— కిరణ్‌: ఏం చేస్తున్నావ్‌? అనిల్‌: మా తమ్ముడికి ఉత్తరం రాస్తున్నాను? కిరణ్‌: మరేమీ రాయడం లేదేం? అనిల్‌: ఐనా ఏం ఫరవాలేదు, వాడికి చదవడం […]

ఆమె స్వెట్టర్‌ అల్లాలనుకుంది. షాపుకు వచ్చి ఒక కేజీ “వూలు” అడిగింది. షాపతను ఎందుకని అడిగాడు. “మా కుక్క పిల్లకు స్వెట్టర్‌ అల్లుదామనుకుంటున్నాను” అంది.
“మీరా కుక్కపిల్లనే తీసుకొస్తే ఎంత వూలు అవసరమో నేను చెబుతాను” అన్నాడు షాపతను.
“కుదరదండీ! నేను మా కుక్కపిల్లకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇద్దామనుకుంటున్నాను” అందామె.

—————————

కిరణ్‌: ఏం చేస్తున్నావ్‌?
అనిల్‌: మా తమ్ముడికి ఉత్తరం రాస్తున్నాను?
కిరణ్‌: మరేమీ రాయడం లేదేం?
అనిల్‌: ఐనా ఏం ఫరవాలేదు, వాడికి చదవడం రాదుగా!

—————————

వాచ్‌మెన్‌: మేడం! ఈ స్విమ్మింగ్‌పూల్‌ రిపేరులో వుంది. ఇక్కడ స్నానం చెయ్యకూడదు. నోటీసు బోర్డు చూడండి.
మేడం: ఆ సంగతి నేను బట్టలు విప్పకముందు చెప్పాలి.
వాచ్‌మెన్‌: బట్టలు విప్పకూడదని ఇక్కడ నోటీసు బోర్డులో రాయలేదు మేడం.

—————————

పింకీ: అంకుల్‌! మీకు ఓ కర్చిఫ్‌ ప్రజెంట్‌ చేద్దామనుకుంటున్నాను.
ఇంతకు మీ “ముక్కు సైజెంత?”

First Published:  10 May 2015 1:01 PM GMT
Next Story