Telugu Global
Others

పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం: కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు తీర్చేలా విద్యుత్‌ ఉత్పత్తిని పెంచుతున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. టీ హబ్‌ ద్వారా విద్యార్థులు, యువకులకు ఉపాధి కల్పిస్తామన్నారు. విప్లవాత్మక పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చామని చెప్పారు. పెట్టుబడులకు స్వర్గధామమైన హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమాలను చేపట్టామని కేటీఆర్‌ వివరించారు. ఐటీతో పాటు ఏరోస్పేస్‌, రక్షణ రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. అమెరికా టూర్‌లో భాగంగా నాలుగో రోజు డల్లాస్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్‌కు టీడీఎఫ్‌, టిటా, టాటా సంస్థల ప్రతినిధులు, పలువురు […]

పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం: కేటీఆర్‌
X
తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు తీర్చేలా విద్యుత్‌ ఉత్పత్తిని పెంచుతున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. టీ హబ్‌ ద్వారా విద్యార్థులు, యువకులకు ఉపాధి కల్పిస్తామన్నారు. విప్లవాత్మక పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చామని చెప్పారు. పెట్టుబడులకు స్వర్గధామమైన హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమాలను చేపట్టామని కేటీఆర్‌ వివరించారు. ఐటీతో పాటు ఏరోస్పేస్‌, రక్షణ రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. అమెరికా టూర్‌లో భాగంగా నాలుగో రోజు డల్లాస్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్‌కు టీడీఎఫ్‌, టిటా, టాటా సంస్థల ప్రతినిధులు, పలువురు ఎన్‌ఆర్‌ఐలు స్వాగతం పలికారు. అక్కడి సినిమా క్లబ్‌లో పెట్టుబడిదారుల విందు సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకుగల అవకాశాలను మంత్రి వివరించారు. పరిశ్రమలు, పారిశ్రామిక పెట్టుబడులపై తెలంగాణ ప్రభుత్వం సహకార ధోరణిలో ముందుకు సాగుతున్నదని చెప్పారు. పెట్టుబడులతో తమ రాష్ర్టానికి వచ్చే వర్గాలకు దేశంలోని ఇతర రాష్ర్టాల కన్నా.. అత్యుత్తమ సౌకర్యాలను కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. డల్లాస్‌లో 150 ఐటీ కంపెనీలతో నిర్వహించిన ఐటీ సర్వ్‌ అలయెన్స్‌ కార్యక్రమంలోనూ మంత్రి పాల్గొన్నారు.తెలంగాణ డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్ట్‌, మిషన్‌ కాకతీయకు 2 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చేందుకు డల్లాస్‌ ఎన్‌ఆర్‌ఐలు సంసిద్ధత వ్యక్తం చేశారు.
First Published:  11 May 2015 1:40 AM GMT
Next Story