Telugu Global
Cinema & Entertainment

తాప్సీ రెండు రోజులు షేక్ అయ్యింది..!

మునీ సీక్వెల్ తో లారెన్స్ ప్రేక్షకులని బాగా భ‌య పెడుతున్నాడు. గ‌తంలో మునీ 2 మాదిరే..ఈ మ‌ధ్య విడుద‌లైన గంగ చిత్రం కూడ అభిమానుల్ని భ‌య పెడుతూ న‌వ్విస్తుంది. ప్ర‌చారం స‌రిగ్గా లేదుకానీ సినిమా సూప‌ర్ హిట్ అయ్యే ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా వున్నాయి. క‌ట్ చేస్తే ఈ చిత్రంతో ఒక కీ రోల్ చేసిన తాప్సీ ఈ చిత్రం చూసి రెండు రోజులు పాటు బాగా భ‌య ప‌డింద‌ట‌. త‌న‌కు స్వ‌తహాగానే భయస్తురాలట‌. అటువంటింది గంగ సినిమా […]

తాప్సీ రెండు రోజులు షేక్ అయ్యింది..!
X

మునీ సీక్వెల్ తో లారెన్స్ ప్రేక్షకులని బాగా భ‌య పెడుతున్నాడు. గ‌తంలో మునీ 2 మాదిరే..ఈ మ‌ధ్య విడుద‌లైన గంగ చిత్రం కూడ అభిమానుల్ని భ‌య పెడుతూ న‌వ్విస్తుంది. ప్ర‌చారం స‌రిగ్గా లేదుకానీ సినిమా సూప‌ర్ హిట్ అయ్యే ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా వున్నాయి. క‌ట్ చేస్తే ఈ చిత్రంతో ఒక కీ రోల్ చేసిన తాప్సీ ఈ చిత్రం చూసి రెండు రోజులు పాటు బాగా భ‌య ప‌డింద‌ట‌. త‌న‌కు స్వ‌తహాగానే భయస్తురాలట‌. అటువంటింది గంగ సినిమా చేస్తున్న‌ప్పుడు తనకు భ‌యం అనిపించలేదట‌ కానీ… సినిమా చూసిన త‌రువాత కొన్ని సీన్స్ బాగా భ‌య పెట్టాయ‌ని చెప్పింది. వాస్తవంగా సినిమా చూడ కూడ‌ద‌నుకుంద‌ట‌. అయితే గంగ సినిమా ద‌ర్శ‌కుడు లారెన్స్ మ‌నం చేసిన చిత్రం మనం చూసుకోక‌ పోతే ఎలా అని ప్రివ్యూ చూపించార‌ట‌. అలా గంగ చిత్రానుభ‌వం చెప్పుకుంది తాప్సీ. న‌టిగా తెలుగులో ఆఫ‌ర్స్ రావ‌డం లేదేమ‌ని అడిగితే ఏమో తెలుగు ఫిల్మ్ మేక‌ర్స్ నే అడ‌గండి అని సెటైర్స్ విసిరింది. అన్న‌ట్లు గంగ సినిమాను హిందిలో రీమేక్ చేస్తే బావుంటుంద‌ని త‌న‌కు తెలిసిన ప్రొడ్యూస‌ర్స్ కు స‌ల‌హా ఇస్తుంద‌ట‌.

First Published:  10 May 2015 9:51 PM GMT
Next Story