Telugu Global
Others

అన్ని ప్ర‌భుత్వ‌శాఖ‌ల్లో ఈ-గ‌వ‌ర్నెన్స్: ఏపీ కేబినెట్ నిర్ణ‌యం

రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఈ-గ‌వ‌ర్నెన్స్‌ను ప్ర‌వేశ పెట్టాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినెట్ నిర్ణ‌యించింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఏపీ కేబినెట్ భేటీలో అనేక నిర్ణ‌యాలు తీసుకున్నారు. స్మార్ట్ సిటీల అమలుకు ఓ స్టీరింగ్ క‌మిటీని ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్య‌మంత్రి ఎన్ చంద్ర‌బాబునాయుడు సార‌ధ్యం వ‌హిస్తారు. ఈ క‌మిటీలో మ‌రో 15 మంది స‌భ్యులుంటారు. ప్ర‌తి పారిశ్రామిక వాడ‌లో చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు స్థ‌లాలు మంజూరు చేయాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ‌ర్గాల‌కు ప్ర‌త్యేక […]

రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఈ-గ‌వ‌ర్నెన్స్‌ను ప్ర‌వేశ పెట్టాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినెట్ నిర్ణ‌యించింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన ఏపీ కేబినెట్ భేటీలో అనేక నిర్ణ‌యాలు తీసుకున్నారు. స్మార్ట్ సిటీల అమలుకు ఓ స్టీరింగ్ క‌మిటీని ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్య‌మంత్రి ఎన్ చంద్ర‌బాబునాయుడు సార‌ధ్యం వ‌హిస్తారు. ఈ క‌మిటీలో మ‌రో 15 మంది స‌భ్యులుంటారు. ప్ర‌తి పారిశ్రామిక వాడ‌లో చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు స్థ‌లాలు మంజూరు చేయాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ‌ర్గాల‌కు ప్ర‌త్యేక రాయితీలు అమ‌లు చేయాల‌ని అభిప్రాయ‌ప‌డింది. 2015-20 టూరిజం పాల‌సీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ మ‌హిళా సాధికార సంస్థ‌కు కోటీ రూపాయ‌ల నిధులు మంజూరు చేయాల‌ని కూడా మంత్రివ‌ర్గం నిర్ణ‌యించింది.
First Published:  11 May 2015 5:20 PM GMT
Next Story