Telugu Global
Others

2017నాటికి అంద‌రికీ అందుబాటులోకి మెట్రో: కేసీఆర్‌

హైద‌రాబాద్ వాసుల చిర‌కాల స్వ‌ప్నం మెట్రోరైల్‌ను 2017నాటికి అంద‌రికీ అందుబాటులోకి తేవాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు ఆదేశించారు. ఈ ప‌థ‌కంపై కేబినెట్‌లో స‌మీక్ష నిర్వ‌హించిన ఆయ‌న మెట్రోరైల్ ప‌థ‌కానికి రూ. 2000 కోట్లు కేటాయించిన‌ట్టు తెలిపారు. భూ సేక‌ర‌ణ‌, పున‌రావాసం, రోడ్ల వెడ‌ల్పు త‌దిత‌ర అంశాల‌ను ప్ర‌భుత్వ‌మే చేప‌డుతుంద‌ని ఆయ‌న చెప్పారు. మెట్రో రైల్‌కు త‌మ ప్ర‌భుత్వం స‌బ్సిడీపై విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. మొత్తం లైను 72 కిలోమీట‌ర్లు పూర్తి చేయాల్సి ఉండ‌గా […]

2017నాటికి అంద‌రికీ అందుబాటులోకి మెట్రో: కేసీఆర్‌
X
హైద‌రాబాద్ వాసుల చిర‌కాల స్వ‌ప్నం మెట్రోరైల్‌ను 2017నాటికి అంద‌రికీ అందుబాటులోకి తేవాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు ఆదేశించారు. ఈ ప‌థ‌కంపై కేబినెట్‌లో స‌మీక్ష నిర్వ‌హించిన ఆయ‌న మెట్రోరైల్ ప‌థ‌కానికి రూ. 2000 కోట్లు కేటాయించిన‌ట్టు తెలిపారు. భూ సేక‌ర‌ణ‌, పున‌రావాసం, రోడ్ల వెడ‌ల్పు త‌దిత‌ర అంశాల‌ను ప్ర‌భుత్వ‌మే చేప‌డుతుంద‌ని ఆయ‌న చెప్పారు. మెట్రో రైల్‌కు త‌మ ప్ర‌భుత్వం స‌బ్సిడీపై విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. మొత్తం లైను 72 కిలోమీట‌ర్లు పూర్తి చేయాల్సి ఉండ‌గా ఇప్ప‌టివ‌ర‌కు 19 కిలోమీట‌ర్లు పూర్త‌య్యింద‌ని వెల్ల‌డించారు. 49 కిలోమీట‌ర్ల మేర పునాదులు, 45 కిలోమీట‌ర్ల మేర పిల్ల‌ర్లు పూర్త‌య్యాయ‌ని తెలిపారు. రైల్వే లైన్ల వ‌ద్ద ఎనిమిది ఒవ‌ర్ బ్రిడ్జిల నిర్మాణానికి అనుమ‌తులు మంజూరు చేశామ‌ని, అలాగే అగ్నిమాప‌క శాఖ కూడా కావ‌ల‌సిన అనుమ‌తులు ఇచ్చింద‌ని కేసీఆర్ తెలిపారు. రాయ‌దుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వ‌ర‌కు మెట్రో రైల్ నిర్మాణం జ‌రుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు. అలాగే ఎల్బీన‌గ‌ర్ నుంచి చంద్రాయ‌ణ‌గుట్ట మీదుగా రైలు మార్గం నిర్మాణ‌మ‌వుతుంద‌ని తెలిపారు. హైద‌రాబాద్ నుంచి ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్ళే వారికి సైతం మెట్రోరైల్ అందుబాటు ఉండేలా చూడాల‌ని ఆయ‌న సూచించారు.
First Published:  12 May 2015 7:08 AM GMT
Next Story