Telugu Global
National

లోక్‌సభలో భూసేకరణ బిల్లు... వ్యతిరేకించిన విపక్షం

సవరించిన భూసేకరణ బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఇందుకు విపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. ఇలాంటి బిల్లే రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నందున మరో బిల్లును ప్రవేశపెట్టడం కూడదన్న విపక్షాల అభ్యంతరాలను స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ తోసిపుచ్చారు. అలాంటి నిబంధనేదీ లేదంటూ బిల్లును ప్రవేశపెట్టే తీర్మానంపై ఓటింగ్‌కు అనుమతినిచ్చారు. ఓటింగ్‌లో అనుకూల నిర్ణయం తరువాత భూసేకరణ బిల్లు (2015)ను గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేందర్‌సింగ్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో విపక్ష కాంగ్రెస్‌ నేత మలికార్జున్‌ ఖర్గే.. మాట్లాడుతూ- ప్రభుత్వం […]

లోక్‌సభలో భూసేకరణ బిల్లు... వ్యతిరేకించిన విపక్షం
X
సవరించిన భూసేకరణ బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఇందుకు విపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. ఇలాంటి బిల్లే రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నందున మరో బిల్లును ప్రవేశపెట్టడం కూడదన్న విపక్షాల అభ్యంతరాలను స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ తోసిపుచ్చారు. అలాంటి నిబంధనేదీ లేదంటూ బిల్లును ప్రవేశపెట్టే తీర్మానంపై ఓటింగ్‌కు అనుమతినిచ్చారు. ఓటింగ్‌లో అనుకూల నిర్ణయం తరువాత భూసేకరణ బిల్లు (2015)ను గ్రామీణాభివృద్ధి మంత్రి బీరేందర్‌సింగ్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో విపక్ష కాంగ్రెస్‌ నేత మలికార్జున్‌ ఖర్గే.. మాట్లాడుతూ- ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పని చేస్తోందని ఆరోపించారు. అయితే, బిల్లును ప్రవేశపెట్టడమే తప్ప ఆమోదించడంలేదని సభా వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు.
2013లో అప్పటి భూసేకరణ బిల్లును హడావుడిగా ఆమోదించాల్సి వచ్చిందని, ఇందులో ఆనాటి అధికార పక్షంతోపాటు బీజేపీ తప్పు కూడా ఉందని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో పాటు, పార్లమెంటు సమావేశాలు పూర్తి కావాల్సి ఉండడంతో బిల్లుకు అప్పట్లో మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. భూసేకరణ బిల్లుకు సవరణలు చేయడం బీజేపీ అజెండా ఏమీ కాదని, తాను ప్రభుత్వం ఏర్పాటు చేశాక, దాదాపు సీఎంలు అందరూ ఈ బిల్లుతో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు లేఖలు రాశారని మోడి చెప్పారు. సవరణ జరగందే అభివృద్ధి పనులు ముందుకు సాగవని చెప్పారని తెలిపారు. ఆ లేఖలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయన్న మోడీ… దాదాపు అన్ని రాష్ర్టాల సీఎంల సూచనలకు అనుగుణంగానే భూసేకరణ బిల్లు 2013కు సవరణలు చేస్తున్నామని చెప్పారు.
First Published:  12 May 2015 12:24 AM GMT
Next Story