Telugu Global
Cinema & Entertainment

మరో సంగీత దర్శకుడికి ఛాన్స్

రవితేజ సినిమాలకు సంబంధించి ఒకరు మాత్రం కచ్చితంగా ఉంటాడు. మాస్ రాజా టీంలో ఎవరు మిస్సయినా అవ్వకపోయినా మ్యూజిక్ డైరక్టర్ తమన్ మాత్రం మస్ట్. అంతలా వీళ్లిద్దరి అనుబంధం పెనవేసుకుపోయింది. కిక్ తో తమన్ ను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది రవితేజే. ఆ తర్వాత మాస్ రాజాకు ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించాడు తమన్. ఇలా వీళ్లిద్దరి బంధం చాలా ఏళ్ల పాటు కొనసాగింది. అయితే ఇప్పుడు బంధానికి బ్రేక్ వేశాడు రవితేజ. అవును.. తన […]

మరో సంగీత దర్శకుడికి ఛాన్స్
X
రవితేజ సినిమాలకు సంబంధించి ఒకరు మాత్రం కచ్చితంగా ఉంటాడు. మాస్ రాజా టీంలో ఎవరు మిస్సయినా అవ్వకపోయినా మ్యూజిక్ డైరక్టర్ తమన్ మాత్రం మస్ట్. అంతలా వీళ్లిద్దరి అనుబంధం పెనవేసుకుపోయింది. కిక్ తో తమన్ ను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది రవితేజే. ఆ తర్వాత మాస్ రాజాకు ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించాడు తమన్. ఇలా వీళ్లిద్దరి బంధం చాలా ఏళ్ల పాటు కొనసాగింది. అయితే ఇప్పుడు బంధానికి బ్రేక్ వేశాడు రవితేజ. అవును.. తన కొత్త సినిమాకు తమన్ కు అవకాశమివ్వలేదు. తాజాగా కిక్-2 సినిమాకి కూడా తమన్ కే అవకాశమిచ్చిన రవితేజ, బెంగాల్ టైగర్ మూవీకి మాత్రం మ్యూజిక్ డైరక్టర్ ను మార్చేశాడు. దర్శకుడు సంపత్ నంది కోరిక మేరకు భీమ్స్ ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాడు. ఇంతకుముందు గాలిపటం, జోరు, కెవ్వు-కేక సినిమాలకు సంగీతం అందించాడు భీమ్స్. అయితే సంగీత దర్శకుడిగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఇప్పుడు మాస్ రాజా ఆశీస్సులతో టాలీవుడ్ లో తమన్ తరహాలో భీమ్స్ కూడా దూసుకుపోతాడని అంచనావేస్తున్నారు క్రిటిక్స్. బెంగాల్ టైగర్ కనుక హిట్టయితే.. భవిష్యత్తులో రవితేజ సినిమాలకు వరుసగా సంగీతం అందించే ఛాన్స్ భీమ్స్ కే దక్కబోతోంది. అయితే అంతా బాగానే ఉంది కానీ, తనకు బాగా కలిసొచ్చిన తమన్ ను రవితేజ ఎందుకు పక్కనపెట్టాడనేది ఫిలింసర్కిల్ లో అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.
First Published:  12 May 2015 12:24 AM GMT
Next Story