Telugu Global
Cinema & Entertainment

స్పీడు పెంచిన మాస్ రాజా

         ఒకప్పుడు రవితేజ సినిమాలు ఏడాదికి మినిమం 4కు తగ్గకుండా థియేటర్లలోకి వచ్చేవి. కానీ ఈమధ్య కాలంలో ఆ కౌంట్ బాగా తగ్గింది. ఒకానొక దశలో ఏడాదికి 5 ఫ్లాపులు రావడంతో సినిమాల విషయంలో దూకుడు తగ్గించాడు రవితేజ. కాస్త నిదానంగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఒక సినిమా పూర్తయిన తర్వాత ఇంకోటి సెట్స్ పైకి తీసుకురావడం ప్రారంభించాడు. అలా ఈమధ్య కాలంలో వరుసగా హిట్స్ కొడుతున్న రవితేజ ఇప్పుడు మళ్లీ స్వింగ్ […]

స్పీడు పెంచిన మాస్ రాజా
X
ఒకప్పుడు రవితేజ సినిమాలు ఏడాదికి మినిమం 4కు తగ్గకుండా థియేటర్లలోకి వచ్చేవి. కానీ ఈమధ్య కాలంలో ఆ కౌంట్ బాగా తగ్గింది. ఒకానొక దశలో ఏడాదికి 5 ఫ్లాపులు రావడంతో సినిమాల విషయంలో దూకుడు తగ్గించాడు రవితేజ. కాస్త నిదానంగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఒక సినిమా పూర్తయిన తర్వాత ఇంకోటి సెట్స్ పైకి తీసుకురావడం ప్రారంభించాడు. అలా ఈమధ్య కాలంలో వరుసగా హిట్స్ కొడుతున్న రవితేజ ఇప్పుడు మళ్లీ స్వింగ్ లోకొచ్చాడు. ఏడాదికి మినిమం 3 సినిమాలు రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే 2 సినిమాల్ని పట్టాలపైకి తీసుకొచ్చిన మాస్ రాజా.. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
కందిరీగ, రభస సినిమాలతో పాపులర్ అయిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు రవితేజ. ఇప్పటికే సంతోష్ శ్రీనివాస్ చెప్పిన కథ విని ఓకే చెప్పేశాడు. మాస్ సినిమాలు తీయడంలో తనకంటూ ఓ స్టయిల్ క్రియేట్ చేసుకున్న సంతోష్ శ్రీనివాస్, రవితేజ బాడీ లాంగ్వేజ్ కు సూటయ్యే విధంగా స్టోరీ రాసుకొచ్చాడు. ఈ సినిమాకు తిక్కరేగింది అనే టైటిల్ అనుకుంటున్నారు. ఇప్పటికే ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా ఈ కొత్త సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది. కిక్-2, బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ కమిటైన మూడో సినిమా ఇది.
First Published:  11 May 2015 11:19 PM GMT
Next Story