Telugu Global
Cinema & Entertainment

పూరీ ఎంత వ‌ర‌కు రీచ్ అవుతాడో..!

 మెగాస్టార్ చిరంజీవి  150 వ సినిమాను  డైరెక్ట్ చేసే అవ‌కాశం  పూరీ జ‌గ‌న్నాధ్ ను  వ‌రించ‌డం ఆయ‌న వ‌ర‌కు  సంతోష‌క‌ర‌మైన వార్తే కానీ..  అభిమానుల విష‌యంలో కొంత ఆందోళ‌న ఉంది.  ఎందుకంటే పూరీ జ‌గ‌న్నాధ్  హీరోలు ఎలా వుంటారు..ఏ త‌ర‌హా డైలాగ్స్ చెబుతారు అనేది ఆడియ‌న్స్ కు సుప‌రిచ‌త‌మే.   వాస్త‌వాల‌కు దూరంగా   వుంటూ ..అసాధ్యాల్ని సుసాధ్యం అంటూ  పూరీ హీరోలు ప‌లికే  సంభాష‌ణ‌లు కొన్ని సార్లు మ‌రీ సిల్లీగా వుంటాయి.  మ‌రి  ఒక డిఫ‌రెంట్ ఇమేజ్ వున్న […]

పూరీ ఎంత వ‌ర‌కు రీచ్ అవుతాడో..!
X

మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాను డైరెక్ట్ చేసే అవ‌కాశం పూరీ జ‌గ‌న్నాధ్ ను వ‌రించ‌డం ఆయ‌న వ‌ర‌కు సంతోష‌క‌ర‌మైన వార్తే కానీ.. అభిమానుల విష‌యంలో కొంత ఆందోళ‌న ఉంది. ఎందుకంటే పూరీ జ‌గ‌న్నాధ్ హీరోలు ఎలా వుంటారు..ఏ త‌ర‌హా డైలాగ్స్ చెబుతారు అనేది ఆడియ‌న్స్ కు సుప‌రిచ‌త‌మే. వాస్త‌వాల‌కు దూరంగా వుంటూ ..అసాధ్యాల్ని సుసాధ్యం అంటూ పూరీ హీరోలు ప‌లికే సంభాష‌ణ‌లు కొన్ని సార్లు మ‌రీ సిల్లీగా వుంటాయి. మ‌రి ఒక డిఫ‌రెంట్ ఇమేజ్ వున్న చిరంజీవికి ఆ త‌ర‌హాలో క్యారెక్ట‌రైజేష‌న్ చేస్తే అభిమానులు రిసీవ్ చేసుకుంటారా? .. పూరీ జ‌గ‌న్నాధ్ చిరంజీవి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన సంద‌ర్భం. అందుకే ఒక వ‌ర్గం అభిమానులు పూరీ జ‌గ‌న్నాధ్ డైరెక్ష‌న్ విష‌యంలో కొంత ఆందోళ‌న ప‌డుతున్న‌ట్లు తెలుస్తుంది. అయితే పూరీ జ‌గ‌న్నాధ్ ఆ మాత్రం తెలియ‌ని వాడు అయితే కాదు అంటున్నారు క్రిటిక్స్.

First Published:  12 May 2015 3:00 AM GMT
Next Story