Telugu Global
Cinema & Entertainment

అక్ష‌య్ కుమార్ ను ఓవ‌ర్ టేక్ చేసిన బిగ్ బీ...! 

పెద్ద హీరో చిత్రం విడుద‌ల‌య్యిందంటే ఫ‌స్ట్ డే.. సెకండ్ డే.. క‌లెక్ష‌న్స్ అంటూ లెక్కలు క‌ట్ట‌డం ఒక ట్రెడిష‌న్ గా మారింది. మొద‌టి రోజు ఎంత ఎక్కువ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తే అంత గా హీరో క్రేజ్ ఉన్న‌ట్లు అంచ‌నాలు వేస్తుంటారు. మ‌రి ఈ లెక్క‌ల ప్ర‌కారం చూస్తే బాలీవుడ్ లో అక్ష‌య్ కుమార్ కంటే ..ఇప్ప‌టికీ అమితాబ్ కే క్రేజ్ ఎక్కువుగా ఉంద‌ని చెప్పాలి. తాజాగా అమితాబ్, దీపిక ప‌దుకొనే క‌ల‌సి చేసిన పీకూ చిత్రం వ‌సూళ్ల […]

అక్ష‌య్ కుమార్ ను ఓవ‌ర్ టేక్ చేసిన బిగ్ బీ...! 
X

పెద్ద హీరో చిత్రం విడుద‌ల‌య్యిందంటే ఫ‌స్ట్ డే.. సెకండ్ డే.. క‌లెక్ష‌న్స్ అంటూ లెక్కలు క‌ట్ట‌డం ఒక ట్రెడిష‌న్ గా మారింది. మొద‌టి రోజు ఎంత ఎక్కువ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తే అంత గా హీరో క్రేజ్ ఉన్న‌ట్లు అంచ‌నాలు వేస్తుంటారు. మ‌రి ఈ లెక్క‌ల ప్ర‌కారం చూస్తే బాలీవుడ్ లో అక్ష‌య్ కుమార్ కంటే ..ఇప్ప‌టికీ అమితాబ్ కే క్రేజ్ ఎక్కువుగా ఉంద‌ని చెప్పాలి. తాజాగా అమితాబ్, దీపిక ప‌దుకొనే క‌ల‌సి చేసిన పీకూ చిత్రం వ‌సూళ్ల ప‌రంగా అక్ష‌య్ కుమార్ న‌టించిన బేబి, గ‌బ్బ‌ర్ ఈజ్ బ్యాక్ చిత్రాల క‌లెక్ష‌న్స్ కంటే చాల బెట‌ర్ గా ఉంద‌ని తెలుస్తుంది. ముఖ్యంగా ఓవ‌ర్సీస్ లో ఈ సినిమా కు ఆద‌ర‌ణ బాగుంద‌ని అక్క‌డ వ‌సూళ్లు తెలియ చేస్తున్నాయి. పీకూ చిత్రం ఓవ‌ర్సీస్ లో నాలుగు రోజుల క‌లెక్ష‌న్స్‌ 30 కోట్లు దాటిన‌ట్లు బాలీవుడ్ ఫిల్మ్ ట్రేడ‌ర్స్ టాక్. సో అమితాబ్, దీపిక తండ్రీ కూతురుగా చేసిన పీకూ అభిమానుల మ‌నుసుల్ని బాగా కొల్ల‌గొట్టిన‌ట్లుంది. అక్ష‌య్ కుమార్ మాత్రం గబ్బ‌ర్ ఈజ్ బ్యాక్ తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డల్‌ కావ‌డం అభిమానుల్ని నిరాశ ప‌రిచే అంశ‌మే..!

First Published:  13 May 2015 3:03 AM GMT
Next Story