Telugu Global
Others

మ‌ళ్లీ దీక్ష‌కు దిగుతా: అన్నా హ‌జారే!

భూ సేక‌ర‌ణ బిల్లుకు వ్య‌తిరేకంగా మ‌రోసారి దీక్ష చేప‌ట్ట‌నున్న‌ట్లు సామాజిక ఉద్య‌మ‌కారుడు అన్నాహ‌జారే వెల్ల‌డించారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఈ బిల్లులో రైతు వ్య‌తిరేక అంశాల‌ను తొల‌గించాల్సిందేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. లేకుంటే జాతీయ స్థాయిలో జైల్‌భ‌రో కార్య‌క్ర మాల‌ను చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ మార్పు రాక‌పోతే మ‌రోసారి నిరాహార దీక్షకు దిగుతాన‌ని ప్ర‌క‌టించారు. గ‌త భూ సేక‌ర‌ణకు సంబంధించి కేంద్రం డిసెంబ‌రులో ఆర్డినెన్సు జారిచేసింది. త‌రువాత లోక్‌స‌భ‌లో ఎలాగోలా నెగ్గించుకుంది. కానీ, రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్షానికి […]

మ‌ళ్లీ దీక్ష‌కు దిగుతా: అన్నా హ‌జారే!
X
భూ సేక‌ర‌ణ బిల్లుకు వ్య‌తిరేకంగా మ‌రోసారి దీక్ష చేప‌ట్ట‌నున్న‌ట్లు సామాజిక ఉద్య‌మ‌కారుడు అన్నాహ‌జారే వెల్ల‌డించారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఈ బిల్లులో రైతు వ్య‌తిరేక అంశాల‌ను తొల‌గించాల్సిందేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. లేకుంటే జాతీయ స్థాయిలో జైల్‌భ‌రో కార్య‌క్ర మాల‌ను చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు. అయిన‌ప్ప‌టికీ మార్పు రాక‌పోతే మ‌రోసారి నిరాహార దీక్షకు దిగుతాన‌ని ప్ర‌క‌టించారు. గ‌త భూ సేక‌ర‌ణకు సంబంధించి కేంద్రం డిసెంబ‌రులో ఆర్డినెన్సు జారిచేసింది. త‌రువాత లోక్‌స‌భ‌లో ఎలాగోలా నెగ్గించుకుంది. కానీ, రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్షానికి మెజారిటీ ఎక్కువ‌గా ఉండ‌టంతో వెన‌కంజ వేసింది. ఈలోగా బిల్లు కాల‌ప‌రిమితి ముగిసింది. దీంతో మ‌రోసారి బిల్లును ప్ర‌వేశ‌పెట్టి ఎలాగైనా ఆమోదించుకోవాల‌ని కేంద్రం భావిస్తోంది. ఈ బిల్లును ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. బీజేపీ కార్పొరేట్ వ‌ర్గాల మేలు కోసం రైతుల భూములు లాక్కొనేందుకే ఈ బిల్లును తీసుకొస్తున్నాయంటూ మండిప‌డుతున్నాయి.
First Published:  12 May 2015 9:23 PM GMT
Next Story