Telugu Global
Cinema & Entertainment

తప్పుల గురించి మాట్లాడుతున్న హన్సిక..

‘తప్పులు అందరు చేస్తారు, కానీ ఆ తప్పుల నుండే మనం అన్నీ నేర్చుకోవాలి. అప్పుడే అదృష్టం కలిసి వస్తుంది. ఒక్కోసారి ఆ తప్పుల్ని మనం వాడుకోవాల్సి వస్తుంది’ అని చెప్తుంది హన్సిక. తెలుగులో కొంత కాలం ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం తమిళ్ ఇండ‌స్ట్రీలో బిజీ గా ఉంది హన్సిక. తెలుగు లో కొత్త హీరోయిన్స్ పోటీ ఎక్కువ ఉండటం వల్ల కోలివుడే బెటర్ అనుకోని తమిళ్ లోనే ఫిక్స్ అయ్యింది ఈ బ్యూటీ. ఇక తన […]

తప్పుల గురించి మాట్లాడుతున్న హన్సిక..
X

‘తప్పులు అందరు చేస్తారు, కానీ ఆ తప్పుల నుండే మనం అన్నీ నేర్చుకోవాలి. అప్పుడే అదృష్టం కలిసి వస్తుంది. ఒక్కోసారి ఆ తప్పుల్ని మనం వాడుకోవాల్సి వస్తుంది’ అని చెప్తుంది హన్సిక. తెలుగులో కొంత కాలం ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం తమిళ్ ఇండ‌స్ట్రీలో బిజీ గా ఉంది హన్సిక. తెలుగు లో కొత్త హీరోయిన్స్ పోటీ ఎక్కువ ఉండటం వల్ల కోలివుడే బెటర్ అనుకోని తమిళ్ లోనే ఫిక్స్ అయ్యింది ఈ బ్యూటీ. ఇక తన నిర్ణయాల గురించి మాట్లాడుతూ ‘ ఎవరైనా ఫ్యూచర్ ప్లాన్ లు వేసుకుంటూనే నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరూ ఓటములను తలుచుకుంటూ ఉండరు. నా విజయాల వెనక మాత్రం వేరే కారణాలు ఉన్నాయి. తప్పు చేయకూడద‌ని నేనెప్పుడు అనుకోను, అలా అనుకుంటే మాత్రం అన్ని కరక్టే చేస్తామంటే అది భ్రమే. ఒకసారి తప్పు చేస్తే మాత్రం, మళ్ళీ అది రిపీట్ అవకుండా చూసుకుంటా.’ అని చెప్తుంది. శింబు ప్రేమ విషయం విఫలమైనప్పటి నుండి వేదాంత ధోరణిలో పోతున్నట్టుందీ ముద్దుగుమ్మ. ఇక తొందరలోనే ఒక యువ హీరోతో తెలుగు సినిమాలో నటిస్తున్నాను అని తెలిపింది . ఏది ఏమైనా హీరోయిన్స్ అందరు తెలివిగా మాట్లాడటం మాత్రం నేర్చేసుకున్నారు..!

First Published:  12 May 2015 7:51 PM GMT
Next Story