షారూక్‌ఖాన్‌కు ఈడీ స‌మ‌న్లు!

బాలీవుడ్ కింగ్ ఖాన్, కోల్‌క‌తా నైట్ రైడర్స్‌ అధినేత షారూక్‌ఖాన్‌ కు భార‌త‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ)స‌మ‌న్లు జారీ చేసింది. కోల్‌క‌తా నైట్‌ రైడ‌ర్స్‌కు చెందిన కొన్ని షేర్ల‌ను గ‌తంలో  జ‌య్ మెహ‌తా అధినేత‌గా ఉన్న సీ ఐలాండ్ ఇన్వెస్ట‌మెంట్ సంస్థ (ఎస్ ఐఐఎల్‌)కు విక్ర‌యించారు. ఆ స‌మ‌యంలో ఆట‌గాళ్ల విలువ‌ను 8-9 రెట్లు త‌క్కువ చేసి చూపించార‌ని ఈడీ ఆరోపిస్తోంది. ఈ విష‌యం త‌మ ఆడిట్‌లో వెల్ల‌డైంద‌ని, దీనివ‌ల్ల ప్ర‌భుత్వానికి దాదాపు రూ.100 కోట్ల ఆదాయం న‌ష్టం వాటిల్లింద‌ని స‌మన్ల‌లో పేర్కొంది. ఈ మేర‌కు విక్ర‌యాల్లో నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేసింది. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోల్‌క‌త్ నైట్ రైడ‌ర్, దాని భాగ‌స్వాముల‌ను ఆదేశించింది.