Telugu Global
Others

మ‌ద్యం వ్యాపారంలోకి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం!

ఒక‌నాడు రాష్ట్రంలో మ‌ద్యం విక్ర‌యాల‌ను పూర్తిగా నిషేధించిన తెలుగుదేశం ప్ర‌భుత్వం ఇపుడు ఏకంగా తనే అమ్మ‌కాలు చేప‌ట్టాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆర్థికంగా క‌ష్టాల్లో ఉన్న రాష్ట్రానికి మ‌ద్యం విక్ర‌యాల ద్వారా వ‌చ్చే ఆదాయం చాలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చంద్ర‌బాబు అనుకుంటున్నార‌ట! రాష్ట్రంలో 4000 మ‌ద్యం షాపులు ఉన్నాయి. వీటి లైసెన్స్ జూన్ 30తో ముగుస్తుంది. వీటి లైసెన్సులు పున‌రుద్ధ‌రించాలా… లేక కొత్త ఎక్సైజ్ విధానం ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం షాపుల‌ను నిర్వ‌హించాలా… అని యోచిస్తోంది. ప్ర‌భుత్వం స్వ‌యంగా […]

మ‌ద్యం వ్యాపారంలోకి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం!
X
ఒక‌నాడు రాష్ట్రంలో మ‌ద్యం విక్ర‌యాల‌ను పూర్తిగా నిషేధించిన తెలుగుదేశం ప్ర‌భుత్వం ఇపుడు ఏకంగా తనే అమ్మ‌కాలు చేప‌ట్టాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆర్థికంగా క‌ష్టాల్లో ఉన్న రాష్ట్రానికి మ‌ద్యం విక్ర‌యాల ద్వారా వ‌చ్చే ఆదాయం చాలా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చంద్ర‌బాబు అనుకుంటున్నార‌ట! రాష్ట్రంలో 4000 మ‌ద్యం షాపులు ఉన్నాయి. వీటి లైసెన్స్ జూన్ 30తో ముగుస్తుంది. వీటి లైసెన్సులు పున‌రుద్ధ‌రించాలా… లేక కొత్త ఎక్సైజ్ విధానం ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం షాపుల‌ను నిర్వ‌హించాలా… అని యోచిస్తోంది. ప్ర‌భుత్వం స్వ‌యంగా నిర్వ‌హిస్తే… అది త‌మిళ‌నాడు విధానం అవుతుంది. అదే కేర‌ళ‌లో అయితే స‌హ‌కార సొసైటీల ద్వారా నిర్వ‌హించాల్సి ఉంటుంది. అదే క‌ర్ణాట‌కలో అయితే స‌గం ప్ర‌భుత్వం, స‌గం ప్ర‌యివేటు వ్య‌క్తుల చేతిలో మ‌ద్యం షాపుల నిర్వ‌హ‌ణ జ‌రుగుతుంది. ఢిల్లీలో కూడా ఇదే విధానం. ఈ రాష్ట్రాల్లో ఎక్సైజ్ మంత్రి కొల్లు ర‌వీంద‌ర్ ప‌ర్య‌టించి ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న విధానాల‌న్నీ అధ్య‌య‌నం చేశారు. జులై 1 నుంచి కొత్త ఎక్సైజ్ పాల‌నీ అమ‌లు చేయాలంటే ఏ విధానం వ‌ల్ల అధికంగా ఆదాయం వ‌స్తుంద‌న్న విష‌యాల‌పై అధ్య‌య‌నం చేయాల‌ని గ‌త సోమ‌వారం ఎక్సైజ్ అధికారుల స‌మావేశంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆదేశించారు. కొత్త పాల‌సీని వారం రోజుల్లో ప్ర‌క‌టించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. త‌మిళ‌నాడు వైపే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మొగ్గు చూపుతున్న‌ట్టు ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. ఆయ‌న మాట‌ల‌ను బ‌ట్టి వారికి అదే అర్ద‌మ‌య్యింద‌ట! ఒక‌వేళ త‌మిళ‌నాడు కాక‌పోతే క‌ర్ణాట‌క త‌ర‌హా విధానానికి మొగ్గు చూపుతున్నారు. క‌ర్ణాట‌క‌లో 20 శాతం వ్యాపారం మాత్ర‌మే ప్ర‌భుత్వ అధీనంలో ఉంది. మొత్తం మీద ఏం చేయాల‌న్నా ప్ర‌జ‌ల‌తో -మ‌మ- అనిపించుకోవాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నారు. 2014-15లో మ‌ద్యం ద్వారా వ‌చ్చే ఆదాయం రూ. 11,488 కోట్లుంది. దీన్ని వ‌చ్చే యేడాది రూ. 12,258 కోట్లకు పెంచాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఒక‌వేళ ప్ర‌యివేటు వ్య‌క్తుల చేతుల్లోకే మ‌ళ్ళీ షాపులు వెళితే మ‌రో రూ. 800 కోట్లు వారి నుంచి రాబ‌ట్టాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది రాష్ట్ర ప్ర‌భుత్వం. ప్ర‌జ‌ల‌తోను, చ‌ర్చావేదిక‌ల‌పైన ప్ర‌భుత్వం ప్ర‌తిపాదిత విధానాన్ని చ‌ర్చ‌కు పెట్టాల‌ని భావిస్తున్నారు. తుది నిర్ణ‌యం తీసుకునే ముందు మొత్తం ప్ర‌జ‌ల నుంచి అందిన వివ‌రాల‌ను మే 23న జ‌రిగే కేబినెట్ స‌మావేశంలో చ‌ర్చించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం భావిస్తోంది. ప్ర‌స్తుత‌మున్న విధానాన్ని న‌వీక‌రించ‌డ‌మా… లేక త‌మిళ‌నాడు మోడ‌ల్‌ను ఏపీలో అమ‌లు చేయ‌డ‌మా… అన్న విష‌యంపై ఇంకా ప్ర‌భుత్వం ఓ నిర్ణ‌యానికి రాలేదు.-పీఆర్‌
First Published:  12 May 2015 7:30 PM GMT
Next Story