Telugu Global
Cinema & Entertainment

షారుక్ ఖాన్ కు  అవ‌మానం లాంటిదే..?

సెల‌బ్రిటి స్టేట‌స్ అనేది   కొన్ని సంద‌ర్భాల్లో   శాప‌మే. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో వాళ్లు ఏది చేసినా న్యూస్ అవుతుంది.  ఎందుకంటే వాళ్లు సెలిబ్రిటీలు కాబ‌ట్టి.  ఆ విష‌యంలో షారుఖ్ ఖాన్,  స‌ల్మాన్ ఖాన్..అమీర్ ఖాన్..అమితాబ‌చ్చ‌న్ ఎవ‌రైనా ఒక్క‌టే.  ఇంత‌కి ఇదంతా ఇప్పుడు ఎందుకంటారా..?  రెండు వేల ప‌న్నెండు  ..ముంబాయిలో జ‌రిగిన  ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్  ను వాఖండే స్టేడియంలో  తిల‌కించ‌డానికి  త‌న పిల్ల‌లతో సహా వ‌చ్చిన షారుక్ ఖాన్ .. అక్క‌డ సెక్యూర్టీ సిబ్బంది  పై […]

షారుక్ ఖాన్ కు  అవ‌మానం లాంటిదే..?
X

సెల‌బ్రిటి స్టేట‌స్ అనేది కొన్ని సంద‌ర్భాల్లో శాప‌మే. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో వాళ్లు ఏది చేసినా న్యూస్ అవుతుంది. ఎందుకంటే వాళ్లు సెలిబ్రిటీలు కాబ‌ట్టి. ఆ విష‌యంలో షారుఖ్ ఖాన్, స‌ల్మాన్ ఖాన్..అమీర్ ఖాన్..అమితాబ‌చ్చ‌న్ ఎవ‌రైనా ఒక్క‌టే. ఇంత‌కి ఇదంతా ఇప్పుడు ఎందుకంటారా..? రెండు వేల ప‌న్నెండు ..ముంబాయిలో జ‌రిగిన ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ ను వాఖండే స్టేడియంలో తిల‌కించ‌డానికి త‌న పిల్ల‌లతో సహా వ‌చ్చిన షారుక్ ఖాన్ .. అక్క‌డ సెక్యూర్టీ సిబ్బంది పై దురుస‌గా ప్ర‌వ‌ర్తించిన విష‌యం తెలిసిందే. కోల్ క‌త్త నైట్ రైడ‌ర్స్ య‌జ‌మాని అయిన షారుక్ 2012 లో జ‌రిగిన మ్యాచ్ స‌మ‌యంలో భ‌ద్ర‌తా సిబ్బింది పై దురుసుగా ప్ర‌వర్తించాడ‌నే కార‌ణంగా అత‌నిపై ఎంసీఏ 5 సంవ‌త్స‌రాలు పాటు స్టేడియంకీ రాకుండా నిషేధించింది. దీంతో ఈనెల 14న ముంబాయి ..కోల్ కత్తా నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్ ను తిలకించే అవ‌కాశం షారుక్ కు లేకండా పోయింది. మరో రేండేళ్ల పాటు ..ముంబాయి వాఖండే స్టేడియంలో ఏది జ‌రిగినా షారుక్ ఖాన్ ను అక్కడ‌ చూసే భాగ్యం లేద‌న్నమాటే. అందుకే సెలిబ్రిటి అయితే బ‌య‌ట‌కు వచ్చిన‌ప్పుడు సివిల్ డిగ్నిటి అంద‌రికంటే ఎక్కువ గా మెయింటిన్ చేయాల్సిన బాధ్య‌త ఉంటుంది. ఆల్‌ రెడీ షారుక్ ఖాన్ కు ఆ నిజం బోధప‌డే వుంటుంది .

First Published:  12 May 2015 8:03 PM GMT
Next Story