Telugu Global
NEWS

అమెరికాలో ఎన్టీఆర్‌ కృష్ణావతారం...

అన్న‌గా తెలుగు ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు అమెరికాలోనూ కొలువు తీరనున్నారు. పౌరాణిక, సాంఘిక పాత్రలతో తరతరాల అశేష అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్‌ని శాశ్వతంగా… అదీ కృష్ణావతారంలో తమ కళ్లముందు నిలుపుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు అమెరికాలోని మన తెలుగువారు. వారి ఆకాంక్షల మేరకు శ్రీకృష్ణుని గెటప్‌లోని 8 అడుగుల ఎత్తు, 80 కిలోల బరువైన ఎన్టీఆర్ పంచలోహ విగ్రహం కాలిఫోర్నియాలో ఏర్పాటు చేయ‌బోతున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజ్ కుమార్ ఒడయార్ ఈ విగ్రహ […]

అమెరికాలో ఎన్టీఆర్‌ కృష్ణావతారం...
X
అన్న‌గా తెలుగు ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు అమెరికాలోనూ కొలువు తీరనున్నారు. పౌరాణిక, సాంఘిక పాత్రలతో తరతరాల అశేష అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్‌ని శాశ్వతంగా… అదీ కృష్ణావతారంలో తమ కళ్లముందు నిలుపుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు అమెరికాలోని మన తెలుగువారు. వారి ఆకాంక్షల మేరకు శ్రీకృష్ణుని గెటప్‌లోని 8 అడుగుల ఎత్తు, 80 కిలోల బరువైన ఎన్టీఆర్ పంచలోహ విగ్రహం కాలిఫోర్నియాలో ఏర్పాటు చేయ‌బోతున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజ్ కుమార్ ఒడయార్ ఈ విగ్రహ రూపశిల్పి. జులైలో జరిగే తానా వేడుకల సందర్భంగా కాలిఫోర్నియాలోని వెస్ట్ కోవినా నగరంలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ వేడుకలలో ఇదే ప్రధాన ఆకర్షణ కానుంది. మరోవైపు నవ్యాంధ్ర నూతన రాజధాని సమీపాన కృష్ణా నదిలోనూ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చురుకుగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహంలా కృష్ణమ్మ ఒడిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్క‌రించ‌డానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.
First Published:  13 May 2015 11:30 AM GMT
Next Story