Telugu Global
Cinema & Entertainment

అమీ జాక్సన్ కి కొత్త లవర్ దొరికాడు..!

కొంత మంది హీరోయిన్ లు రూమర్స్ ఇష్ట పడరు. ఏ చిన్న రూమర్ వచ్చినా కాని మీడియా మీద ఫైర్ అయిపోతారు. కొంత మంది ఇలాంటివి విని వదిలేస్తారు. కాని మరి కొంత మంది మాత్రం కావాలనే రూమర్స్ కి ట్రై చేస్తూ ఉంటారు. ఇలాంటి వారి జాబితాలో లక్ష్మి రాయ్, పూనం పాండే లాంటి వాళ్ళు ముందు ఉంటారు. ఇప్పుడు అమీ జాక్సన్ కూడా వీళ్ళ లిస్టు లోకి చేరిపోయారు. ఇప్పటికే ఈ బ్యూటీ కి […]

అమీ జాక్సన్ కి కొత్త లవర్ దొరికాడు..!
X

కొంత మంది హీరోయిన్ లు రూమర్స్ ఇష్ట పడరు. ఏ చిన్న రూమర్ వచ్చినా కాని మీడియా మీద ఫైర్ అయిపోతారు. కొంత మంది ఇలాంటివి విని వదిలేస్తారు. కాని మరి కొంత మంది మాత్రం కావాలనే రూమర్స్ కి ట్రై చేస్తూ ఉంటారు. ఇలాంటి వారి జాబితాలో లక్ష్మి రాయ్, పూనం పాండే లాంటి వాళ్ళు ముందు ఉంటారు. ఇప్పుడు అమీ జాక్సన్ కూడా వీళ్ళ లిస్టు లోకి చేరిపోయారు. ఇప్పటికే ఈ బ్యూటీ కి చాలా లవ్ అఫైర్స్ ఉన్నాయని వార్తలు వచ్చినా కాని, అవేమి పట్టించుకోకుండా తన బాయ్ ఫ్రెండ్ లతో తిరుగుతూనే ఉంటుంది.

ఇక ఇప్పుడు తన కొత్త లవర్ తో దిగిన ఫోటో లు ఓ లండన్ పత్రికలో ప్రింట్ అయ్యాయి. అతను ఎవరో కాదు, లండన్ లో ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అత్యంత ఖరీదైన లివరఫుల్ నగరంలో ఒక ప్లే గ్రౌండ్ ని అతను నిర్వహిస్తాడట. ఒక బిలీనియర్ తో ప్రేమాయణం చేస్తున్న అమీ గురించి అక్కడ పెద్ద చర్చగా మారిందని సమాచారం. ఏది ఏమైనా లవ్ చేస్తే అది కూడా కాస్ట్లీ గా ఉండటం అనేది ఈమెను చూసే నేర్చుకోవాలి మరి..!

First Published:  13 May 2015 8:18 PM GMT
Next Story