Telugu Global
Cinema & Entertainment

 అప్పుడు రొమాన్స్.. ఇప్పుడు ఛేజింగ్

     నాగచైతన్య-గౌతమ్ మీనన్ కాంబినేషన్ చెప్పగానే గుర్తొచ్చే సినిమా ఏమాయచేసావె. నిజంగా ఆ సినిమా జనాల్ని మాయ చేసింది అప్పట్లో. నెగెటివ్ టాక్ తో ప్రారంభమై సూపర్ హిట్ దిశగా దూసుకుపోయింది. లవ్ స్టోరీస్ తీయడంలో పండిపోయిన గౌతమ్ మీనన్, నాగచైతన్యకు కెరీర్ లో మొట్టమొదటి విజయాన్నందించాడు. అందుకే చైతూకు గౌతమ్ మీనన్ అంటే ఎప్పుడూ గౌరవం. ఇప్పుడీ ద్వయం మరోసారి కలిసేందుకు ఫ్లాట్ ఫాం రెడీ అయింది. గతంలో ఏమాయచేసావె లాంటి రొమాంటిక్ సినిమా […]

 అప్పుడు రొమాన్స్.. ఇప్పుడు ఛేజింగ్
X
నాగచైతన్య-గౌతమ్ మీనన్ కాంబినేషన్ చెప్పగానే గుర్తొచ్చే సినిమా ఏమాయచేసావె. నిజంగా ఆ సినిమా జనాల్ని మాయ చేసింది అప్పట్లో. నెగెటివ్ టాక్ తో ప్రారంభమై సూపర్ హిట్ దిశగా దూసుకుపోయింది. లవ్ స్టోరీస్ తీయడంలో పండిపోయిన గౌతమ్ మీనన్, నాగచైతన్యకు కెరీర్ లో మొట్టమొదటి విజయాన్నందించాడు. అందుకే చైతూకు గౌతమ్ మీనన్ అంటే ఎప్పుడూ గౌరవం. ఇప్పుడీ ద్వయం మరోసారి కలిసేందుకు ఫ్లాట్ ఫాం రెడీ అయింది. గతంలో ఏమాయచేసావె లాంటి రొమాంటిక్ సినిమా చేసిన జోడీ.. ఇప్పుడు ఓ యాక్షన్ కథ చేయాలని డిసైడైంది. ఈ సినిమాలో కూడా సమంతనే హీరోయిన్ గా తీసుకోవాలని కూడా ప్రాధమికంగా అనుకున్నారు.

అంతా బాగానే ఉంది కానీ, యాక్షన్ కథ అంటేనే అందర్లో డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే.. యాక్షన్ కథలకు చైతూ సరిపోడనే టాక్ ఇప్పటికే ఇండస్ట్రీలో వ్యాపించింది. ఆటోనగర్ సూర్య, దడ లాంటి ఎన్నో యాక్షన్ సినిమాలు ఫెయిలయ్యాయి చైతూ ఖాతాలో. దీంతో మరో యాక్షన్ కథ అనేసరికి అంతా అవాక్కయ్యారు. కానీ తనను గౌతమ్ మీనన్ కచ్చితంగా యాక్షన్ హీరోగా నిలబెడతాడని నమ్ముతున్నాడు నాగచైతన్య. అన్నట్టు గతంలో సూర్య తిరస్కరించిన కథనే ఇప్పుడు చైతూతో గౌతమ్ తెరకెక్కించనున్నాడనేది తాజా ప్రచారం.
First Published:  14 May 2015 12:33 AM GMT
Next Story