Telugu Global
Cinema & Entertainment

పాతికేళ్ల అద్భుతం  డిజిట‌ల్ ఫార్మేట్ లో ...!

     పాతికేళ్ల వెండితెర అద్భుతం జ‌గ‌దేక వీరుడు అతిలోక సుందరి.  చిరంజీవి, శ్రీదేవి,  రాఘ‌వేంద్ర‌రావు, అశ్వీనీ ద‌త్ లీడ్ రోల్స్ లో వ‌చ్చిన ఈ చిత్రం పాతికేళ క్రితం విడుద‌ల‌యి ఘ‌న విజ‌యం సాధించింది. ఈ సినిమాను డిజిటిల్ ఫార్మేట్ లో తీసుక రావ‌డానికి ప్రొడ్యూస‌ర్ అశ్వీనీ ద‌త్ సిద్దం అయ్యారు.  రాంచ‌ర‌ణ్ తో జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి చిత్రం సీక్వెల్ చేయాల‌నే ఆలోచనలో కూడా ఉన్నారట‌. అయితే  దానికి ముందుగానే ఈ సినిమాను […]

పాతికేళ్ల అద్భుతం  డిజిట‌ల్ ఫార్మేట్ లో ...!
X

పాతికేళ్ల వెండితెర అద్భుతం జ‌గ‌దేక వీరుడు అతిలోక సుందరి. చిరంజీవి, శ్రీదేవి, రాఘ‌వేంద్ర‌రావు, అశ్వీనీ ద‌త్ లీడ్ రోల్స్ లో వ‌చ్చిన ఈ చిత్రం పాతికేళ క్రితం విడుద‌ల‌యి ఘ‌న విజ‌యం సాధించింది. ఈ సినిమాను డిజిటిల్ ఫార్మేట్ లో తీసుక రావ‌డానికి ప్రొడ్యూస‌ర్ అశ్వీనీ ద‌త్ సిద్దం అయ్యారు. రాంచ‌ర‌ణ్ తో జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి చిత్రం సీక్వెల్ చేయాల‌నే ఆలోచనలో కూడా ఉన్నారట‌. అయితే దానికి ముందుగానే ఈ సినిమాను డిజిట‌ల్ ఫార్మేట్ లో చేయాలనుకుంటున్నారు.
ఒక సోషియో ఫాంట‌సీగా వ‌చ్చిన ఈ చిత్రం అభిమానుల హృద‌యాల్ని కొల్ల కొట్టింది. రాఘ‌వేంద్రుడు ఈ సినిమాను ఒక దృశ్య కావ్యంగా మ‌లిచారు. మంచి త‌నం..మాన‌వ‌త్వం, ధైర్యం, నిష్క‌ల్మ‌ష హృద‌యం వున్న రోల్ లో చిరంజీవిది అద్భుత న‌ట‌న‌. అతిలోక సుంద‌రిగా శ్రీ‌దేవి .. మహాద్రుష్ట‌ వంటి రోల్ లో అమ్రిష్ పూరి నటన‌ సినిమాను ఒక గొప్ప చిత్రంగా మలిచారు..

First Published:  14 May 2015 1:23 AM GMT
Next Story