Telugu Global
Cinema & Entertainment

 మహేష్ కోసం మరో పోకిరి

     మహేష్ కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా పోకిరి. 75 వసంతాల తెలుగుసినీచరిత్రను తిరగరాసింది ఆ మూవీ. మహేష్-పూరి కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమా ఓ చరిత్ర. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బిజినెస్ మేన్ సినిమా కూడా చేశారు. పోకిరి రేంజ్ లో సునామీ సృష్టించకపోయినా ట్రెండ్ సెట్ చేసింది. మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ ద్వయం ముచ్చటగా మూడో సినిమాకు సిద్ధమౌతోంది. మహేష్ కోసం పోకిరి లాంటి కథ మరోటి తయారుచేశానని […]

 మహేష్ కోసం మరో పోకిరి
X
మహేష్ కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా పోకిరి. 75 వసంతాల తెలుగుసినీచరిత్రను తిరగరాసింది ఆ మూవీ. మహేష్-పూరి కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమా ఓ చరిత్ర. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బిజినెస్ మేన్ సినిమా కూడా చేశారు. పోకిరి రేంజ్ లో సునామీ సృష్టించకపోయినా ట్రెండ్ సెట్ చేసింది. మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ ద్వయం ముచ్చటగా మూడో సినిమాకు సిద్ధమౌతోంది. మహేష్ కోసం పోకిరి లాంటి కథ మరోటి తయారుచేశానని ప్రకటించాడు పూరి.

పోకిరి సినిమాతో మహేష్ ను డిఫరెంట్ గా ప్రజెంట్ చేశాడు పూరి. ప్రస్తుతం మహేష్ లో కనిపిస్తున్న ఎన్నో షేడ్స్, మేనరిజమ్స్ పోకిరి నుంచి వచ్చినవే. అలా మహేష్ ను పూర్తిగా మార్చేసిన చిత్రంగా పోకిరిని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మహేష్ ను పోకిరికి భిన్నంగా మరింత కొత్తగా, ట్రెండ్ సెట్ చేసేలా చూపించడానికి రెడీ అవుతున్నాడు పూరి. నిజానికి పూరి-మహేష్ కాంబినేషన్ లో మూడో సినిమా ఇప్పటికే రావాల్సింది. కానీ పూరి చెప్పిన చాలా కథల్ని ప్రిన్స్ రిజెక్ట్ చేశాడు. తన ఇమేజ్ ను కంప్లీట్ గా మార్చేసే కథ కావాలని డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్ మేరకు మహేష్ కోసం మాంఛి మసాలా కథ సిద్ధంచేశాడట పూరి. సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. కానీ కథకు మాత్రం మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
First Published:  14 May 2015 12:06 AM GMT
Next Story