Telugu Global
Cinema & Entertainment

ముకుందాన్ని పక్కనపెట్టిన పూరి

నిజానికి పూరి జగన్నాధ్ దర్శకత్వంలోనే హీరోగా పరిచయం అవ్వాలనుకున్నాడు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్‌. కానీ ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. తర్వాత శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో ముకుందా చేసి హీరోగా తెరంగేట్రం చేశాడు వరుణ్. పోనీ రెండో సినిమాకైనా పూరితో కలిసి పనిచేద్దామనుకుంటే అది కూడా సాధ్యం కాలేదు. ఎన్టీఆర్ తో టెంపర్ సినిమాకు కమిటయ్యాడు పూరి. దీంతో తన రెండో సినిమాను క్రిష్ తో వర్కవుట్ చేస్తున్నాడు వరుణ్ […]

ముకుందాన్ని పక్కనపెట్టిన పూరి
X
నిజానికి పూరి జగన్నాధ్ దర్శకత్వంలోనే హీరోగా పరిచయం అవ్వాలనుకున్నాడు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్‌. కానీ ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదు. తర్వాత శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో ముకుందా చేసి హీరోగా తెరంగేట్రం చేశాడు వరుణ్. పోనీ రెండో సినిమాకైనా పూరితో కలిసి పనిచేద్దామనుకుంటే అది కూడా సాధ్యం కాలేదు. ఎన్టీఆర్ తో టెంపర్ సినిమాకు కమిటయ్యాడు పూరి. దీంతో తన రెండో సినిమాను క్రిష్ తో వర్కవుట్ చేస్తున్నాడు వరుణ్ తేజ్‌. ఈసారి ముచ్చటగా మూడోసారైనా పూరితో కలిసి పనిచేద్దామని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు వరుణ్. ఈసారి పూరి కూడా మాటిచ్చాడు. కానీ ఈసారి వీళ్లిద్దరి మధ్య మెగాస్టార్ అడ్డం వచ్చాడు. అవును.. చిరంజీవి 150వ సినిమా పూరితో కన్ ఫర్మ్ కావడంతో వరుణ్ మూడో సినిమా సందిగ్దంలో పడింది. వరుణ్ తో సెట్స్ పైకి వెళ్తే.. ఇప్పట్లో చిరు 150వ సినిమా షూటింగ్ ప్రారంభం కాదు. అలాఅని చిరంజీవి సినిమాతోనే కొనసాగితే.. వరుణ్, తన మూడో సినిమాకు మరో డైరక్టర్ ను వెదుక్కోవాలి. మొత్తానికి మెగా కాంపౌండ్ లో పూరి జగన్నాధ్ కు వాల్యూ బాగానే పెరిగింది.
First Published:  14 May 2015 3:03 AM GMT
Next Story