Telugu Global
International

ఘోర రైలు ప్ర‌మాదం... మృతులు ఏడుగురు

గంట‌కి యాభై మైళ్ళు వెళ్ళాల్సిన రైలు రెట్టింపు వేగంతో వెళితే వాటిల్లే ప్ర‌మాదం ఏమిటో ఆ రైలులో ఉన్న ప్ర‌యాణికులు చ‌వి చూశారు. ఆ స‌మ‌యంలో రైలులో ఉన్న వంద‌లాది మంది మృత్యువు వ‌ర‌కు వెళ్ళి త‌ప్పించుకుని గాయాల‌తో బ‌య‌ట ప‌డ‌గా… ఏడుగురు మాత్రం తిరిగిరాని లోకాల‌కు వెళ్ళిపోయారు. మామూలుగా అయితే అది పెద్ద మ‌లుపు. ఆ మ‌లుపులో రైలు 50 మైళ్ళ‌కు మించి వేగంగా వెళ్ళ‌కూడ‌దు. ఆ మలుపుని ఊహించ‌ని  డ్రైవ‌ర్ 106 మైళ్ళ వేగంతో […]

ఘోర రైలు ప్ర‌మాదం... మృతులు ఏడుగురు
X
గంట‌కి యాభై మైళ్ళు వెళ్ళాల్సిన రైలు రెట్టింపు వేగంతో వెళితే వాటిల్లే ప్ర‌మాదం ఏమిటో ఆ రైలులో ఉన్న ప్ర‌యాణికులు చ‌వి చూశారు. ఆ స‌మ‌యంలో రైలులో ఉన్న వంద‌లాది మంది మృత్యువు వ‌ర‌కు వెళ్ళి త‌ప్పించుకుని గాయాల‌తో బ‌య‌ట ప‌డ‌గా… ఏడుగురు మాత్రం తిరిగిరాని లోకాల‌కు వెళ్ళిపోయారు. మామూలుగా అయితే అది పెద్ద మ‌లుపు. ఆ మ‌లుపులో రైలు 50 మైళ్ళ‌కు మించి వేగంగా వెళ్ళ‌కూడ‌దు. ఆ మలుపుని ఊహించ‌ని డ్రైవ‌ర్ 106 మైళ్ళ వేగంతో రైలుని న‌డుపుతున్నాడు. అక‌స్మాత్తుగా మ‌లుపు వ‌చ్చింది. గ‌మ‌నించిన వెంట‌నే బ్రేక్ వేశాడు. అంతే రైలు అదుపు త‌ప్పింది. మొత్తం బోగీల‌న్నీ ప‌ట్టాల్ని దాటి కిందికి ప‌డి పోయాయి. ఫిల‌డెల్ఫియాలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన తీరు, సంఘ‌ట‌న స్థ‌లి చూస్తే… ఏడుగురే చ‌నిపోవ‌డం అదృష్ట‌మ‌నే చెప్పాలి… అని ఫెడ‌ర‌ల్ రైల్‌రోడ్ అడ్మినిస్ట్రేష‌న్ అధికారి ఒక‌రు వ్యాఖ్యానించారు. బ్రేక్ వేసే స‌రికి 106 మైళ్ళ స్పీడుతో వెళుతున్న రైలు మూడు సెక‌న్ల‌లో అంటే ప్ర‌మాదం జ‌రిగే స‌మ‌యానికి 102 మైళ్ళ‌కు త‌గ్గింద‌ని… ఆ స‌మ‌యంలోనే ప్ర‌మాదం సంభ‌వించింద‌ని నేష‌న‌ల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డు మెంబ‌ర్ రోబ‌ర్ట్ సుంవాత్‌ అన్నారు. అస‌లు ప్ర‌మాదానికి కార‌ణాలు తెలుసుకునే ప‌నిలో త‌మ బోర్డు ఉంద‌ని ఆయ‌న చెప్పారు.
First Published:  14 May 2015 4:46 AM GMT
Next Story