Telugu Global
Cinema & Entertainment

లయన్ రివ్యూ

రేటింగ్: 2.75/5 ‘సింహ’లో తండ్రీ కొడుకులు అయితే ‘లెజెండ్’లో అన్నదమ్ములు. మరి ‘లయన్’లో గాడ్సే బోసూ. ఈ యిద్దరూ ఒక్కరేనా? ఒక్కరూ యిద్దరూనా? మార్చురీ లోంచి లేచొచ్చిన హీరో (బాలకృష్ణ) – అంతకన్నాముందు రామమనోహర్ లోహియా హాస్పిటల్ లో పద్దెనిమిది నెలలుగా బ్రెయిన్ డెడ్ అయి కోమాలోంచి లేచొచ్చాడు. నువ్వు బోసువి కాదు, గాడ్సేవి అని – మురుగన్ కంపెనీ సీఈఓ అని తలిదండ్రులూ డాక్టర్లూ కంపెనీ పెద్దల నుండి రిసెప్సనిస్టు వరకూ చెపుతూవుంటే – గుగ్గిళ్ళ మహాలక్ష్మిగా పరిచయమయి ప్రేమించిన మంజుల (త్రిష) నువ్వెవరో […]

లయన్ రివ్యూ
X

రేటింగ్: 2.75/5

‘సింహ’లో తండ్రీ కొడుకులు అయితే ‘లెజెండ్’లో అన్నదమ్ములు. మరి ‘లయన్’లో గాడ్సే బోసూ. ఈ యిద్దరూ ఒక్కరేనా? ఒక్కరూ యిద్దరూనా? మార్చురీ లోంచి లేచొచ్చిన హీరో (బాలకృష్ణ) – అంతకన్నాముందు రామమనోహర్ లోహియా హాస్పిటల్ లో పద్దెనిమిది నెలలుగా బ్రెయిన్ డెడ్ అయి కోమాలోంచి లేచొచ్చాడు. నువ్వు బోసువి కాదు, గాడ్సేవి అని – మురుగన్ కంపెనీ సీఈఓ అని తలిదండ్రులూ డాక్టర్లూ కంపెనీ పెద్దల నుండి రిసెప్సనిస్టు వరకూ చెపుతూవుంటే – గుగ్గిళ్ళ మహాలక్ష్మిగా పరిచయమయి ప్రేమించిన మంజుల (త్రిష) నువ్వెవరో తెలీదుమొర్రో అంటుంటే – నేనే నీ భార్యను అని ఊటీ అనుభావాల్ని సయితం సరయు (రాధికా ఆప్టే) చెపుతుంటే – నువ్వు మా అబ్బాయివి కాదు అని నమ్మిన తలిదండ్రులూ కాదంటూ వుంటే – మేకపిల్ల కాదు పందిపిల్ల అని పదుగురూ అంటే పంది అన్నచందంగా నమ్మలేక నమ్మి బోసును కాదు గాడ్సే ని అని రాజీపడి వెనక్కి వెళ్ళిన హీరో – ఎందుకో మళ్ళీ వెళ్లిన దారినుండి వెనక్కి వచ్చి – ఆపదలోవున్న కన్నతల్లి తనపేగు తిరగబడిన సందర్భంలో బోసువే అనిచెప్పకనే చెప్పి హీరోకు ప్రేక్షకులకు వున్న కన్ఫ్యుజన్ని తొలగిస్తుంది. బోసు చుట్టూవున్న ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకున్న ముఖ్యమంత్రి (ప్రకాష్ రాజ్) బోసు అస్తిత్వం చెరిపేసి ‘గాడ్సే’ని సృష్టిస్తాడు. ఎందుకు? తన రాజకీయ ఎదుగుదల కోసం. హత్యలకు పాల్పడ్డ ముఖ్యమంత్రి తీగలాగి డొంక కదల్చబోయిన సిబిఐ ఆఫీసర్ బోసుని – అతని కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని – బోసుని చావు అంచులదాకా తీసుకెళ్తాడు. చంపిన మరుక్షణం అది ముఖ్యమంత్రిని చుట్టుకొని ప్రమాదం అయ్యేలా పద్మవ్యుహాన్ని బోసుముందే రచిస్తాడు. అయితే గాడ్సే బోసుగా మళ్ళీ ఎలా రికవరీ అయ్యాడో వదిలిపెట్టి ముఖ్యమంత్రిని కట్టడి చేసే ఆట ఎలా ఆడాడో – దాచిన రహస్యాలను ఎలా బయటపెట్టాడో తెలుసుకోవాలంటే మిగతా కథ తేరమీద చూడాల్సిందే!

బాలకృష్ణ నటనకు ఎప్పటిలాగే తగ్గలేదు. త్రిష మెరిసింది. రాధికాఆప్టేకు కథలో చోటు తక్కువ. జయసుధ, చంద్ర మోహన్, కోటా శ్రీనివాసరావుల పాత్రలు చెప్పుకోతగ్గవిగా లేవు. బాలకృష్ణ సినిమా చేస్తున్నానన్న స్పృహలోనే వుండిపోయాడు దర్శకుడు. వెరసి మరో రొటీన్ కథ. కథనం మాత్రం కాస్త కొత్త దారిన నడిచింది. ప్రదమార్థం కాస్త విసుగును తెప్పించినా ద్వితీయార్థంలో తిరిగి కథ సినిమా పట్టాలెక్కింది.

ప్లస్: కథనం, ఫైట్స్, ద్వితీయార్థంలో ఉపయోగించిన సాంకేతికత

మైనస్: త్రిష బాలకృష్ణల లవ్ ట్రాక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

రొటీన్: కథ, పాటలు, డైలాగులు

బేనర్: slv సినిమా, నిర్మాత: రుద్రపాటి రామారావు, ఫోటోగ్రఫీ: వెంకట ప్రసాద్,

మ్యూజిక్: మణిశర్మ, ఎడిటర్: గౌతం రాజు, కథ-కథనం-మాటలు-దర్శకత్వం: సత్యదేవ్

First Published:  14 May 2015 9:42 AM GMT
Next Story