మరోసారి బిపాసాపై రూమర్లు

బిపాసా బసు వయసేం తక్కువ కాదు. ఎప్పుడో 30 దాటేసింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు వయసైపోతోందనే ప్రశ్నలు కూడా మీడియా నుంచి వచ్చేస్తున్నాయి. కానీ మూడు పదుల వయసులోనూ ఇంకా లవ్-రొమాన్స్-డేటింగ్ అంటూ ఎంజాయ్ చేస్తోంది బిప్స్. ఇప్పటికే ఇద్దరు హీరోలకు బ్రేకప్ చెప్పేసిన ఈ బ్లాక్ బ్యూటీ ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రియుడితో డేటింగ్ కు రెడీ అవుతోందనే ప్రచారం బాలీవుడ్ లో జోరుగా సాగుతోంది.
      దాదాపు తొమ్మిదేళ్ల పాటు జాన్ అబ్రహాంతో డేటింగ్ చేసింది బిపాసా బసు. వీళ్లిద్దరి ఎఫైర్ బహిరంగ రహస్యమే. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే ఇద్దరూ చాలా ఏళ్లు సహజీవనం చేశారు. ఇక పెళ్లి ఒక్కటే తరువాయి అనుకునే టైమ్ లో విడిపోయింది ఆ జంట. అంతకంటే ముందు డినో మారియోతో కూడా డేట్ చేసింది ఈ బెంగాలీ బ్యూటీ. వాళ్లిద్దరూ మాజీలు అయిపోవడంతో ఇప్పుడు తాజాగా మరో అబ్బాయిని ట్రాప్ లో పడేసిందని టాక్. తన సహనటుడు కరణ్ గ్రోవర్ తో బిపాసా బాగా ఎటాచ్ అయిందనే రూమర్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఇద్దరూ కలిసి త్వరలోనే హాలీడే ఎంజాయ్ చేయడానికి స్విట్జర్లాండ్ మంచుకొండలకు పయనమౌతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.