సెంచరీకి  ఒక్క ప‌రుగు దూరంలో  బాల‌య్య‌.. !

న‌టుడిగా దాదాపు నాలుగు ప‌దుల‌ అనుభ‌వం. బాల న‌టుడిగా తండ్రి నంద‌మూరి రామ‌రావుతో క‌ల‌సి న‌టించిన బాల‌య్య‌. ఇప్ప‌టివ‌ర‌కు 98 చిత్రాలు పూర్తి చేశాడు. ఈ 98వ చిత్రం లయన్ కొత్త ద‌ర్శ‌కుడు స‌త్య‌దేవ్ తో చేశాడు. ఈ సినిమా మిక్స్ డ్ టాక్ గెయిన్ చేసింది. కాగా బాల‌య్య త‌దుప‌రి సినిమాకు రంగం సిద్దం అయ్యింది. గోపిచంద్ తో గ‌త యేడాది లౌక్యం చిత్రం చేసి మంచి స‌క్సైస్ త‌న ఖాతాలో వేసుకున్న ద‌ర్శ‌కుడు ఇ నివాస్ .. బాల‌య్య తో 99 వ చి్త్రం చేస్తున్నాడు. క‌థ కూడా సిద్దం అయిన‌ట్లు తెలుస్తుంది.
     బాల‌కృష్ణ ఇమేజ్ కు , ఆయ‌న శైలికి స‌రిగ్గా స‌రిపోయో క‌థ‌ను డైరెక్ట‌ర్ రెడి చేశారట. కోన వెంక‌ట్ , గోపి మోహ‌న్ ల‌తోపాటు.. బీవిఎస్ ర‌వి, డైమండ్ ర‌త్నం, శ్రీ‌ధ‌ర్ సీపాన వంటి వారు ర‌చ‌న స‌హాకారంతో స్టోరిని అద్భుతంగా సిద్దం చేసిన‌ట్లు తెలుస్తుంది. ఈ సినిమా కంప్లీట్ అవ్వ‌గానే త‌న 100 వ చిత్రం చేయ‌డానికి ఇప్ప‌టి నుంచే డైరెక్ట‌ర్స్ హంట్ లో నంద‌మూరి బాల‌య్య వున్న‌ట్లు తెలుస్తుంది. అన్ని కుదిరితే రాజ‌మౌళి లేదంటే బోయ‌పాటి శీను బాల‌కృష్ణ నూర‌వ చిత్రం చేసే అవ‌కాశం ఉంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో వినిపిస్తున్న టాక్.