Telugu Global
Others

బూతు వెబ్ సైట్లపై భారత ప్రధాని క‌న్నెర్ర!

బూతు వెబ్‌సైట్లను నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తామరతంపరగా పెరిగిపోతున్న అశ్లీల వెబ్‌సైట్లపై ప్రధాని నరేంద్ర మోడీ కన్నెర్రజేయడంతో, వాటి భరతం పట్టడానికి కేంద్రం సిద్ధమైంది. ఆయా సైట్ల నిరోధానికి చర్యలు తీసుకోవాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను మోడీ ఆదేశించారు. దీనికి సంబంధించి అశ్లీల వెబ్‌సైట్స్‌ జాబితాను తయారు చేయాల్సిందిగా ఆయన కోరారు. భారతీయ సంస్కృతికి ఇవి విరుద్ధం కాబట్టి వాటిని నిరోధించాలన్న నిర్ణయం తీసుకుంటున్నట్లు ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. […]

బూతు వెబ్‌సైట్లను నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తామరతంపరగా పెరిగిపోతున్న అశ్లీల వెబ్‌సైట్లపై ప్రధాని నరేంద్ర మోడీ కన్నెర్రజేయడంతో, వాటి భరతం పట్టడానికి కేంద్రం సిద్ధమైంది. ఆయా సైట్ల నిరోధానికి చర్యలు తీసుకోవాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను మోడీ ఆదేశించారు. దీనికి సంబంధించి అశ్లీల వెబ్‌సైట్స్‌ జాబితాను తయారు చేయాల్సిందిగా ఆయన కోరారు. భారతీయ సంస్కృతికి ఇవి విరుద్ధం కాబట్టి వాటిని నిరోధించాలన్న నిర్ణయం తీసుకుంటున్నట్లు ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. ఇలాంటి సైట్లు దాదాపు 4 కోట్ల దాకా ఉంటాయని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ టీమ్‌ అంచనా వేసింది.
అశ్లీల వెబ్‌సైట్లపై తెలంగాణ రాష్ట్ర సీఐడీ అధికారులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. ఏ రాష్ట్రం చేయని సాహసాన్ని చేసేందుకు సీఐడీ అధికారులు ముందడుగు వేశారు.1400 అశ్లీల వెబ్‌సైట్లపై కేసులు నమోదు చేసిన అధికారులు వీటిపై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అశ్లీల వెబ్‌సైట్ల వల్ల తలెత్తుతున్న పరిణామాలను పిటిషన్‌లో వివరించారు. చిన్నారులు, యువతులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్లో ఎక్కువమటుకు అవే కారణమనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కోర్టు ఇచ్చే తదుపరి ఆదేశాల ప్రకారం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అశ్లీల సైట్లను నిలువరించాలని తెలంగాణ సీఐడీ అధికారులు భావిస్తున్నారు.కేంద్రం కూడా ఇదే ఆలోచిస్తున్నందున తెలంగాణ సీఐడీ అధికారుల ప‌ని సులువ‌వుతుంది.
First Published:  15 May 2015 12:03 AM GMT
Next Story