ప్రభాస్ సినిమాకి స్క్రీన్ ప్లే రెడీ

యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం బాహుబలి సినిమాను పూర్తిచేశాడు. ఈ మూవీ మొదటి భాగం విడుదలకు సిద్ధమైంది. రెండో భాగం షూటింగ్ ఇంకా కొంత మిగిలే ఉంది. సెట్స్ పైకి వెళ్లడానికి కూడా కొంత టైం ఉంది. ఈ గ్యాప్ లో మరో సినిమా చేసేయాలని ఫిక్స్ అయ్యాడు ప్రబాస్. రన్ రాజా రన్ డైరక్టర్ సుజిత్ తో ఓ సినిమా చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. ఆ తర్వాత సుజిత్ కంప్లీట్ గా అదే సినిమా పనిమీద పడ్డాడు. ఎట్టకేలకు ప్రభాస్ కోసం కథ-స్క్రీన్ ప్లే మొత్తం సిద్ధంచేశాడు. ప్రభాస్ తో మిర్చి లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజిత్ దర్శకత్వంలో కొత్త సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది. ఈ సినిమా కోసం పెంచిన బాడీని ఇప్పుడిప్పుడే మళ్లీ తగ్గిస్తున్నాడు ప్రభాస్. బాహుబలి పార్ట్-2కు ఇంకా టైమ్ ఉండడంతో గెటప్ కూడా మార్చే ఉద్దేశంలో ఉన్నాడు. సుజిత్ తో చేయబోయే సినిమా లవ్ కమ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఉండబోతోందని సమాచారం.