Telugu Global
Others

ఎర్ర‌చంద‌నం చోరీ కేసులో పోలీసుల స‌స్పెన్ష‌న్‌

స్మ‌గ్ల‌ర్ల‌నుంచి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేష‌న్‌లో ఉంచిన ఎర్ర చంద‌నం దుంగ‌ల‌ను పోలీసుల క‌న్నుగ‌ప్పి ఎత్తుకుపోయారు కొంత‌మంది దొంగ‌లు. కడప జిల్లా ఒంటిమిట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఈసంఘ‌ట‌న జ‌రిగింది. స్టేషన్‌ ఆవరణలో ఇలా దొంగ‌త‌నం జ‌ర‌గ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఎర్రచందనం దొంగల భరతం పడతామని ఒంటిమిట్ట స్టేషన్‌ నుంచి టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హెచ్చరించిన రెండు, మూడు రోజులకే.. స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ఈ మండలానికి చెందిన బొడ్డే వెంకటరమణ అనే బడా స్మగ్లర్‌తోపాటు […]

స్మ‌గ్ల‌ర్ల‌నుంచి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేష‌న్‌లో ఉంచిన ఎర్ర చంద‌నం దుంగ‌ల‌ను పోలీసుల క‌న్నుగ‌ప్పి ఎత్తుకుపోయారు కొంత‌మంది దొంగ‌లు. కడప జిల్లా ఒంటిమిట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఈసంఘ‌ట‌న జ‌రిగింది. స్టేషన్‌ ఆవరణలో ఇలా దొంగ‌త‌నం జ‌ర‌గ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఎర్రచందనం దొంగల భరతం పడతామని ఒంటిమిట్ట స్టేషన్‌ నుంచి టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హెచ్చరించిన రెండు, మూడు రోజులకే.. స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ఈ మండలానికి చెందిన బొడ్డే వెంకటరమణ అనే బడా స్మగ్లర్‌తోపాటు మరో ఐదారుగురిని కడప పోలీసులు అరెస్టు చేసి రూ.9 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలా స్వాధీనం చేసుకున్న దుంగలనే ఎర్రచందనం స్మగ్లర్లు గురువారం రాత్రి ఎత్తుకెళ్లడం పోలీసులకు సవాల్‌ విసిరినట్లయింది. స్టేషన్‌లో 160 దుంగలు ఉండగా.. 18 దుంగలు తీసుకెళ్లారు. వీటి విలువ రూ.కోటి వరకూ ఉంటుందని అంచనా. ఇది పోలీసుల‌కు తెలిసి జ‌రిగిందా… తెలియ‌కుండా జ‌రిగిందా అనేది కూడా ఆలోచించాల్సిన అంశం. ఒంటిమిట్ట పోలీస్‌స్టేషన్‌లో ఎర్రచందనం దుంగలు చోరీ కేసులో ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరిస్తున్న మరో ఆరుగురు కానిస్టేబుళ్లను కూడా జిల్లా ఎస్పీ దుగ్గల్ సస్పెండ్ చేశారు.
First Published:  15 May 2015 12:08 AM GMT
Next Story