శంకర్ తప్పు తెలుసుకున్నాడోచ్..

దర్శకుడు శంకర్ తన తప్పు తాను తెలుసుకున్నాడు. తను ఎక్కడ, ఎందుకు ఫెయిలవుతున్నాడో అర్థం చేసుకున్నాడు. అందుకే నెక్ట్స్ సినిమాకు ఆ తప్పు చేయకూడదని ఫిక్స్ అయ్యాడు. దానికి తగ్గట్టే చర్యలు మొదలుపెట్టాడు. తాజాగా శంకర్ ఏంచేశాడనే దానికంటే ముందు గతంలో శంకర్ ఏం చేశాడో ఓసారి చెప్పుకుందాం.. ఐ సినిమాని అన్నీ తానై తెరకెక్కించాడు శంకర్. ఈ సినిమాకు కాన్సెప్ట్ అనుకున్నప్పటి నుంచి కథ, స్క్రీన్ ప్లే వరకు చాలా విభాగాల్ని దగ్గరుండి చూసుకున్నాడు. కానీ సినిమా విడుదలైన తర్వాత ఐ లో శంకర్ మార్క్ లేదనే కామెంట్స్ వినిపించాయి. విమర్శలు రావడమేంటి.. ఏకంగా సినిమానే తిప్పికొట్టారు ప్రేక్షకులు. దానికి కారణం శంకర్ మార్క్ సస్పెన్స్, థ్రిల్ ఐ మూవీలో మిస్సయ్యాయి. మేకప్, గ్రాఫిక్స్ పై ఎక్కువ దృష్టిపెట్టిన శంకర్.. ఐ మూవీలో కథ-స్క్రీన్ ప్లేని గాలికి వదిలేశారు. ఆ పొరపాటే వందల కోట్ల రూపాయల్ని బుగ్గిపాలు చేసింది. 
     అందుకే తన నెక్ట్స్  సినిమాకు ఆ తప్పు చేయకూడదని ఫిక్స్ అయ్యాడు శంకర్. రజనీకాంత్ తో రోబో-2 సినిమాకు రెడీ అవుతున్న ఈ దర్శకుడు ఈసారి కథ, స్క్రీన్ ప్లే బాధ్యతల్ని మరొకరికి అప్పగించాడు. కేవలం దర్శకత్వంపైనే దృష్టిపెట్టాలనుకుంటున్నాడు. మొత్తానికి ఇన్నాళ్లకు ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు శంకర్.