టాప్ గేర్ లోకి మారిన బాలయ్య

మొన్నటివరకు ఇటు సినిమాలు, అటు రాజకీయాలు అంటూ రెండూ సమతూకంగా ఉండేలా చూసుకున్నారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. కానీ ఇకపై పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టాలని ఫిక్స్ అయ్యారు. వందో సినిమాకు ముహూర్తం దగ్గరపడుతుండడంతో చకచకా సినిమాలు పూర్తిచేసి వందో మైలురాయి అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 98వ సినిమా లయన్ ను థియేటర్లలోకి దింపిన నటసింహం.. ఇప్పుడు వెంటనే 99వ సినిమాను పట్టాలపైకి తీసుకొచ్చేందుకు స్కెచ్ రెడీచేశారు. ఈనెలలోనే బాలకృష్ణ 99వ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. శ్రీవాస్ దర్శకత్వంలో ఈనెల 29న బాలయ్య 99వ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇంకా హీరోయిన్లు ఎవరో తేల్చనప్పటికీ.. సినిమా షూటింగ్ మాత్రం కొనసాగించాలని నిర్ణయించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు డిక్టేటర్ అనే పేరును పరిశీలిస్తున్నారు. దాదాపు ఇదే టైటిల్ ను కొనసాగించవచ్చు. మరో మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎరోస్ ఇంటర్నేషనల్, వారాహి చలనచిత్ర సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.